close
Choose your channels

బ‌న్నీ సీక్రెట్‌ను బ‌య‌ట పెట్టిన త్రిష‌

Monday, March 30, 2020 • తెలుగు Comments

బ‌న్నీ సీక్రెట్‌ను బ‌య‌ట పెట్టిన త్రిష‌

క‌రోనా వైర‌స్ ఎఫెక్ట్‌తో ఇండియా మొత్తం లాక్ డౌన్ అయ్యింది. సినిమా షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. స్టార్స్ అంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మైయారు. వేరే ప‌నులేవీ లేక‌పోవ‌డంతో అంద‌రూ కుటుంబ స‌భ్యుల‌తో గ‌డుపుతున్నారు. మిగిలిన స‌మ‌యం త‌మ తోటి స్టార్స్‌తో సోష‌ల్ మీడియా ద్వారా ట‌చ్‌లో ఉన్నారు. కోలీవుడ్ భామ తాజాగా టాలీవుడ్‌కి చెందిన ఇద్ద‌రు స్టార్స్‌తో వీడియో కాల్‌లో మాట్లాడింది. ఆ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్న నాకు స్నేహితులైన అల్లు అర్జున్‌, రానా ద‌గ్గుబాటి మంచి కంపెనీ ఇచ్చారు. అదే స‌మ‌యంలో బ‌న్నీకి సంబంధించిన ఓ సీక్రెట్‌ను కూడా త్రిష బ‌య‌ట పెట్టేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 5.8 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ ఉన్న బ‌న్నీ..సీక్రెట్‌గా మ‌రో అకౌంట్‌ను కూడా మెయిన్‌టెయిన్ చేస్తున్నాడ‌ట‌.

త్రిష తెలుగులో సినిమా చేసి చాలా కాల‌మైంది. నిజానికి చిరంజీవి 152వ చిత్రంలో ఆచార్య‌లో త్రిష‌నే ముందు హీరోయిన్‌గా అనుకున్నారు. అయితే తీరా క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ అనే కార‌ణంతో త్రిష సినిమా నుండి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇప్పుడు ఆ స్థానంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తోంది.

Get Breaking News Alerts From IndiaGlitz