Download App

తెలుగులో `96` రిలీజ్ డేట్‌

విల‌క్ష‌ణ న‌టుడు విజ‌య్ సేతుప‌తి హీరోగా.. త్రిష హీరోయిన్‌గా న‌టించిన చిత్రం `96`. ఈ రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ ఈ శుక్ర‌వారం త‌మిళంలో ఈ నెల 13 అంటే రేపు త‌మిళంలో విడుద‌ల కానుంది. గోవింద్ మీన‌న్ సంగీత సార‌థ్యంలో ఇటీవ‌ల విడులైన ట్రైల‌ర్‌లోని బ్యాగ్రౌండ్ స్కోర్‌కి, పాట‌ల‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సి.ప్రేమ్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో నంద‌గోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమా హ‌క్కుల‌ను ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు ద‌క్కించుకున్నారు. ఈయ‌న ఈ సినిమాను అక్టోబ‌ర్ 4న విడుద‌ల చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నార‌ని  స‌మాచారం. ఈ సినిమాకు మ‌హేంద్ర‌న్ జ‌య‌రాజ్‌, ఎన్‌.ష‌ణ్ముగ సుంద‌రం సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.