ప్రేమమ్ కి త్రివిక్రమ్ చేసినసాయం ఇదే..!

  • IndiaGlitz, [Wednesday,October 05 2016]

అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీ ప్రేమ‌మ్. మ‌ల‌యాళంలో సంచ‌ల‌న విజ‌యం సాధించిన ప్రేమ‌మ్ చిత్రాన్ని అదే టైటిల్ తో రీమేక్ చేసిన విష‌యం తెలిసిందే.
ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించారు. అయితే...సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ అధినేత రాధాకృష్ణ‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ఇద్ద‌రికి మంచి అనుబంధం ఉంది. అందుచేత ప్రేమ‌మ్ సినిమాకి త్రివిక్ర‌మ్ స్ర్కిప్ట్ విష‌యంలో ఎంతో కొంత హెల్ప్ చేసుంటారు అని ప్ర‌చారం జ‌రిగింది. ఇదే విష‌యం గురించి హీరో నాగ‌చైత‌న్య‌ను అడిగితే...త్రివిక్ర‌మ్ స్ర్కిప్ట్ విష‌యంలో నాతో ఏమీ డిష్క‌స్ చేయ‌లేదు. చందుతో ఏమైనా డిష్క‌స్ చేసారేమో. నేనైతే నాన్న‌గారు వాయిస్ ఓవ‌ర్ కి డైలాగ్స్ రాసారేమో అనుకుంటున్నాను అంటూ త్రివిక్ర‌మ్ చేసిన మాట‌ల సాయం గురించి బ‌య‌ట‌పెట్టారు చైతు..! అది సంగ‌తి..!