మ‌హేష్‌ను డైరెక్ట్ చేస్తున్న త్రివిక్ర‌మ్‌

  • IndiaGlitz, [Thursday,September 29 2016]

సూప‌ర్ స్టార్ మ‌హేష్‌, స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ అంటేనే క్రేజీ...వీరి కాంబినేష‌న్ లో గ‌తంలో అత‌డు, ఖ‌లేజా చిత్రాలు విడుద‌ల‌య్యాయి. త్రివిక్ర‌మ్ డైలాగ్ ను మ‌హేష్ చెప్పే మాడ్యులేష‌న్ లెక్క ప‌రిగా ఉంటుంది కాబ‌ట్టే ఈ కాంబినేష‌న్‌ను ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌పై తీసుకురావడానికి సన్నాహాలు జ‌రుగుతున్నాయి. అయితే సినిమా కంటే ముందుగానే త్రివిక్ర‌మ్ మ‌హేష్‌ను డైరెక్ట్ చేయ‌బోతున్నాడ‌ట‌.

అదేలాగంటే క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ రూపంలోన‌న్న‌మాట‌. మ‌హేష్ సినిమాల‌తో పాటు పలు క‌మ‌ర్షియ‌ల్ బ్రాండ్స్‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉన్నాడు. తాజాగా ఆన్ లైన్ టికెటింగ్ కంపెనీ అయిన అభి బ‌స్‌.కామ్ సంస్థ‌కు మ‌హేష్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా చేయ‌డానికి అంగీక‌రించాడు. ఈ సంస్థ‌కు సంబంధించిన యాడ్స్‌ను డైరెక్ట్ చేసి పెట్టాల్సిందిగా సంస్థ త్రివిక్ర‌మ్ ను కోరింద‌ట‌. త్రివిక్ర‌మ్ కూడా స‌రేన‌న‌డంతో అభిబ‌స్ కు సంబంధించిన యాడ్స్‌ను వ‌చ్చే నెల‌లో త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్‌పై రూపొందించ‌నున్నారు.