ప‌వ‌న్‌తో త్రివిక్ర‌మ్‌..?

జ‌న‌సేనాని ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ కామ్‌గా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేసిన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ రీ ఎంట్రీ ఇవ్వ‌డ‌మే కాదు.. వ‌రుస సినిమాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే బాలీవుడ్ సినిమా పింక్‌ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి వ‌కీల్‌సాబ్ అనే టైటిల్ ప్ర‌ముఖంగా విన‌ప‌డుతుంది. దీని త‌ర్వాత క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ ఓ పీరియాడిక‌ల్ సినిమా చేయ‌బోతున్నాడు. అలాగే మూడో చిత్రంగా హ‌రీశ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌లో కూడా ప‌వ‌న్ సినిమా చేయ‌బోతుతున్నాడు. కాగా.. నాలుగో చిత్రానికి ప‌వ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలోనే ఈ సినిమా ఉంటుంద‌ని అంటున్నారు.

ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ అన‌గానే జ‌ల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు గుర్తుకు వ‌స్తున్నాయి. జ‌ల్సా స‌క్సెస్ అయితే.. అత్తారింటికి దారేది చిత్రం ఇండ‌స్ట్రీ హిట్ అయ్యింది. ఇక అజ్ఞాత‌వాసి డిజాస్ట‌ర్‌గా నిలిచింది. త‌ర్వాత ప‌వ‌న్ రాజకీయాల్లో వెళ్లిపోయారు. రెండేళ్ల త‌ర్వాతే రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ ఎంట్రీ త‌ర్వాత ప‌వ‌న్‌కి త్రివిక్ర‌మ్ క‌థ‌ను వినిపించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని గుస‌గుస‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి ఇందులో నిజా నిజాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

More News

విక్ట‌రీతో చ‌ర‌ణ్ చిత్రం..!!

సీనియ‌ర్ అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌రైన వెంక‌టేశ్‌తో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ సినిమా చేయ‌బోతున్నాడా? అంటే అవున‌నే సమాధానం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుండి వ‌స్తుంది.

'ఆర్ఆర్ఆర్` నుండి చెర్రీ, ఆలియా లుక్స్ లీక్స్..?

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కులుగా న‌టిస్తోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్‌’. డి.వి.వి.దాన‌య్య నిర్మాత‌. భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాను ‘బాహుబ‌లి’

నిర్మాత డి.సురేష్ బాబు చేతుల మీదుగా 'పోస్టర్' సినిమా టిజర్ లాంచ్

ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ ఎంతో ఫేమస్. అందులో ఎన్నో సినిమాలు వంద రోజులు ఆడాయి.

నన్ను నలభై ఏళ్లు వెనక్కి పంపింది - ‘శంకరాభరణం’ చూసి స్పందించిన విశ్వనాధ్‌

జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మొట్ట మొదటి తెలుగు సినిమా ‘శంకరాభరణం’ విడుదలై 40 ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా బాపురమణ అకాడమీ ఆధ్వర్యంలో ప్రసాద్‌ ల్యాబ్‌లో

రష్మికకి షాక్... ముద్దు పెట్టి అభిమాని పరుగో పరుగు 

హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న‌.. ఈ క‌న్న‌డ క‌స్తూరికి ఇప్పుడు టాలీవుడ్‌లో భారీ డిమాండే ఉంది.