close
Choose your channels

తహసీల్దార్ హత్యతో రెవెన్యూ అధికారులకు కొత్త తలనొప్పి!

Tuesday, November 5, 2019 • తెలుగు Comments

తహసీల్దార్ హత్యతో రెవెన్యూ అధికారులకు కొత్త తలనొప్పి!

హైదరాబాద్‌లో తహసీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయ్. ఎక్కడికక్కడ రెవెన్యూ అధికారులు ఆందోళన చేపట్టారు. ఇదిలా ఉంటే.. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాలలో రెవెన్యూ అధికారులు ధర్నా చేస్తుండగా అధికారులకు ఊహించని షాక్ తగిలింది.

రెవెన్యూ సిబ్బంది తన దగ్గర లంచం తీసుకున్నారని.. ఆ సొమ్ము తిరిగివ్వాలని మహిళా రైతు నిలదీసింది. ఆ మహిళా నిలదీతతో అధికారులకు ఏం చేయాలో తెలియక మిన్నకుండిపోయారు. కాగా.. పాసు పుస్తకాలకు సంబంధించి జాప్యం చేస్తున్నారని మరికొందరు రైతులు నిలదీశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. మొత్తానికి చూస్తే విజయారెడ్డి దారుణ హత్యతో ఇలాంటి విషయాలన్నీ వెలుగు చూస్తుండగా.. రెవెన్యూ అధికారులకు మాత్రం కొత్త తలనొప్పి మొదలైంది. సో.. దీన్ని బట్టి చూస్తే ఎక్కడెక్కడ ఏ అధికారులు లంచాలు తీసుకున్నారో వారి బుగ్గలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయ్.. మున్ముంథు ఇలాంటి వీడియోలు ఎన్నెన్ని వెలుగు చూస్తాయో మరి.

Get Breaking News Alerts From IndiaGlitz