అమెరికాలో టీఆర్ఎస్ అధికార ప్రతినిధి హత్య..

  • IndiaGlitz, [Wednesday,December 30 2020]

అమెరికాలో ప్రముఖ ఎన్ఆర్ఐ హత్య తీవ్ర కలకలం రేపుతోంది. టీఆర్ఎస్ అధికార ప్రతినిధిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. నల్గొండ జిల్లాలోని దేవరకొండకు చెందిన దేవేందర్ రెడ్డి అమెరికాలోని న్యూజెర్సీలో ఉంటున్నారు. ఆయనను మంగళవారం న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్‌లో హత్య చేశారు. అయితే దేవేందర్ రెడ్డి హత్యకు గల కారణాలను పోలీసులు చాలా గోప్యంగా ఉంచుతున్నారు. దీంతో ఆయన హత్యపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.

దేవేందర్ రెడ్డి హత్యపై పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. దేవేందర్ రెడ్డి తన కారులో కూర్చొని ఎవరితోనో మాట్లాడుతుండగా.. ఆయనను హత్య చేశారని కొందరు చెబుతుండగా... ఓ బాంబు పేలుడు ద్వారా ఈ హత్య చేశారని కొందరు.. అగ్ని ప్రమాదం కారణం మరణించాడని కొందరు చెబుతున్నారు. అసలు కారణం మాత్రం తెలియరావడం లేదు. అయితే దేవేందర్ రెడ్డి కూర్చున్న కారుకి సంబంధించిన ఫొటో మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఆ కారు విండో షీల్డ్స్ ఎవరో పగలగొట్టినట్లు ఉంది. ఫోటోను బట్టి చూస్తే అక్కడేదో పేలుడు జరిగినట్లే కనిపిస్తోంది. కాగా.. దేవేందర్ రెడ్డి అమెరికాలోని తెలంగాణ రాష్ట్ర సమితి అధికార ప్రతినిధిగా పని చేస్తున్నారు. పార్టీ వ్యవహారాల్లో చాలా చురుకుగా వ్యవహరిస్తుంటారని తెలుస్తోంది. దేవేందర్ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ అమెరికాలోని తెలంగాణ ఎన్నారైలు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

More News

డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్లు టెర్రరిస్ట్‌లతో సమానం: సీపీ సజ్జనార్

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మద్యం సేవించి డ్రైవింగ్ చేసే వారి విషయమై సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘వ‌కీల్ సాబ్’‌... ప‌వ‌న్ పూర్తి చేశాడు

వ‌కీల్‌సాబ్‌..ఇటు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు, అటు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ఓపెద్ద టెన్ష‌న్ తీరింది. ‘వ‌కీల్ సాబ్’ సినిమా కోసం ప‌వ‌న్ చాలా త‌క్కువ రోజులే కాల్షీట్స్ ఇచ్చాడు.

ఎల్ఆర్ఎస్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు..

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్‌పై (వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు) ప్రజానీకం నుంచి వ్యతిరేకత వస్తోంది.

న్యూ ఇయర్ ముందు ఉద్యోగులపై కేసీఆర్ వరాల జల్లు

నూతన సంవత్సర కానుకగా రాష్ట్రంలోని అన్నిరకాల ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని, ఉద్యోగ విరమణ వయస్సును పెంచాలని, అన్నిశాఖల్లో

'తెర వెనుక' దర్శకుడు వెల్లుట్ల ప్రవీణ్ చందర్ ఇంటర్వ్యూ..

1996 లో వచ్చిన ఆలీ ,ఇంద్రజ ల పిట్టలదొర సినిమా ద్వారా నృత్య దర్శకునిగా పరిచయమై.