తనని బ్యాన్ చేసిన ట్విట్టర్ కి పోటీగా 'గెట్టెర్'.. ట్రంపా మజాకా!

అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ట్రంప్ ఎంత హంగామా చేశాడో అందరికి తెలిసిందే. అధ్యక్షుడిగా కంటే తన విలక్షణమైన ప్రవర్తనతో ట్రంప్ ప్రపంచం మొత్తం పాపులర్ అయ్యాడు. హింసని ప్రేరేపిస్తున్నాడనే కారణాలతో ట్విట్టర్, ఫేస్ బుక్ సంస్థలు ట్రంప్ ఖాతాలని నిరవధికంగా బ్యాన్ చేశాయి.

దీనితో తాను సొంతంగా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ని ఏర్పాటు చేసుకుంటానని ట్రంప్ గతంలో చెప్పాడు. ఈ అమెరికా మాజీ అధ్యక్షుడు అన్నంత పని చేశాడు. ట్విట్టర్ కు పోటీగా గెట్టెర్(GETTR) ప్రారంభించాడు. ఇతర సోషల్ మీడియా వేదికల్లా కాకుండా ఇందులో పూర్తిగా భావప్రకటనకు స్వేచ్ఛ ఉంటుందట.

ఇదీ చదవండి: హోప్ ఇస్తున్న జె అండ్ జె కోవిడ్ వ్యాక్సిన్.. కేవలం సింగిల్ డోస్ లోనే..

2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమి చెందారు. అమెరికా 46 వ ప్రెసిడెంట్ గా బైడెన్ విజయం సాధించారు. ఓటమి అసహనంతో ట్రంప్ తన అనుచరులని, అభిమానులని రెచ్చగొట్టేలా, హింసని ప్రేరేపించేలా సోషల్ మీడియా పోస్ట్స్ పెట్టాడు. క్యాపిటల్ భవనంపై దాడిని ప్రేరేపించేలా ట్రంప్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి సంస్థలు ట్రంప్ పై బ్యాన్ విధించాయి.

దీనితో సొంతంగా శోకాలు మీడియా ఫ్లాట్ ఫామ్ ప్రారంభించాలని ట్రంప్ భావించారు. అనుకున్నట్లుగానే గురువారం గెట్టెర్ లాంచ్ అయినట్లు తెలుస్తోంది. దీనితో ట్రంప్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ గెట్టెర్ ఏ రేంజ్ లో పాపులర్ అవుతుందో చూడాలి.

More News

కొత్త పెళ్ళికూతురికి ఈడీ సమన్లు.. హీరోయిన్ పై రూ.1.5 కోట్ల వివాదం!

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ యామి గౌతమ్ వివాదంలో చిక్కుకుంది. ఇటీవలే యామి గౌతమ్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే.

కారు ప్రమాదానికి గురైన కన్నడ నటుడి తనయుడు.. బైక్ ని తప్పించబోయి..

ప్రముఖ కన్నడ నటుడు, పొలిటీషియన్ అయిన జగ్గేష్ తనయుడు యతి రాజ్ కారు ప్రమాదానికి గురయ్యారు.

బి గ్రేడ్ నటి, అడుక్కుంటుంది.. తాప్సిపై సంచలన వ్యాఖ్యలు

ఫైర్ బ్రాండ్ హీరోయిన్ కంగనా రనౌత్ కి కోపం వస్తే ఇక అంతే. ఎదుటివారు ఎవరైనా సరే నిప్పులు చెరిగేస్తుంది.

ఢిల్లీ ఎయిర్ పోర్ట్ పై రాజమౌళి అసంతృప్తి.. విదేశీయులు ఇలాంటివి చూస్తే..

దర్శకధీరుడు రాజమౌళి చాలా కూల్ గా ఉంటారు. ఎప్పుడూ తన వర్క్ పనే ఫోకస్ పెడతారు.

హోప్ ఇస్తున్న జె అండ్ జె కోవిడ్ వ్యాక్సిన్.. కేవలం సింగిల్ డోస్ లోనే..

అమెరికాలోని అగ్రగామి మెడికల్ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ తీపి కబురు చెప్పింది. కరోనా వైరస్ ప్రపంచానికి పెను శాపంగా మారింది.