ట్రంప్ సంతకం చూసి షాక్.. సెటైర్లే.. సెటైర్లు!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుటుంబ సమేతంగా ఇండియాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి సబర్మతీ ఆశ్రమానికి చేరుకున్నారు. వారితో పాటు మెలానియా, కేంద్ర మంత్రులు, గుజరాత్‌ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని గాంధీజీ చిత్రపటానికి నూలు దండ వేసి ట్రంప్ దంపతులు నివాళులర్పించారు. అనంతరం సబర్మతీ ఆశ్రమంలోని గాంధీ చరఖా గురించి ట్రంప్ దంపతులకు మోదీ వివరించారు. ఈ సందర్భంగా ట్రంప్ దంపతులు చరఖాను తిప్పి నూలు వడికారు. ఆశ్రమ సిబ్బంది ద్వారా చరఖా పనితనం గురించి తెలుసుకున్నారు. అనంతరం సబర్మతీ ఆశ్రమంలో ఉన్న మూడు కోతుల బొమ్మలను ట్రంప్‌ దంపతులు చూసి ముచ్చటపడిపోయారు. కాగా.. ఆశ్రమాన్ని సందర్శించిన వారిలో ట్రంప్‌తో పాటు ఆయన కుమార్తె ఇవాంకా, అల్లుడు కుష్నర్, ఇతర అధికార బృందం కూడా ఉన్నారు.
               
పుస్తకంలో ఏం రాశారు..!?
అయితే ఈ సందర్శన సందర్భంగా.. సందర్శకుల పుస్తకంలో ఆయన ఏం రాశారన్నదానిపై అందరిలోనూ సర్వత్రా ఆసక్తి నెలకొంది. ‘ఈ అద్భతమైన అవకాశం కల్పించినందుకు నా గొప్ప మిత్రుడు నరేంద్ర మోదీ ధన్యవాదాలు’ అని పుస్తకంలో రాసి కింది భాగాన సంతకం పెట్టి అమెరికా అధ్యక్షుడు అని కూడా రాశారు. ట్రంప్ సంతకం చేసిన ఆ పేజీ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

సెటైర్లే సెటైర్లు!
ట్రంప్ సంతకాన్ని చూసిన నెటిజన్లు, పలువురు విమర్శకులు పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు. ఆయన సంతకం అచ్చుగుద్దినట్లుగా ‘ఈసీజీ’, ‘హార్ట్ బీట్’ స్కానింగ్‌లాగా ఉందని సెటైర్లేస్తున్నారు. మరికొందరైతే ఆ ఈసీజీ.. ట్రంప్ సంతకం చేసిన ఫొటోలు పక్కపక్కనే పెట్టి తేడా ఏమైనా గమనించారా..? అచ్చం అలానే ఉందా..? చెప్పుకోండి చూద్దాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరైతే ఆయన రాసిన అక్షరాల్లో ‘గ్రేట్ ఫ్రెండ్’ కాదు ట్రంప్ గారూ.. ‘డియర్ ఫ్రెండ్’ అని రాయాలంటూ ఉచిత సలహాలు కూడా ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సంతకం సంబంధించిన వ్యవహారం నెట్టింట్లో వైరల్ అవుతోంది. మరోవైపు ఈసీజీకి సంబంధించిన పిక్‌లు తెగ వైరల్ అవుతున్నాయ్.

More News

మోదీకి ఫుట్‌బాల్.. ట్రంప్‌కు క్రికెట్!

టైటిల్ చూడగానే కాస్త కన్ఫూజ్ అయ్యారు కదూ..! అవును.. మీరు వింటున్నది నిజమేనండోయ్..

భూ ప్రపంచం మీదే ‘మోదీ’ గొప్పనేత : ట్రంప్

గుజరాత్‌లోని మెతెరా స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాల్గొన్నారు.

‘భూమండలంలో ఎవరి దగ్గర లేని ఆయుధాలు ఇండియాకు ఇస్తా’

రక్షణ ఒప్పందాల్లో భాగంగా మా మిత్ర దేశం భారత్‌కు ఈ భూమండలం మీద అత్యుత్తమం అనదగ్గ మిలిటరీ పరికరాలను అందించాలని అనుకుంటున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పుకొచ్చారు.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఇవాంక : మోదీ

సబర్మతీ ఆశ్రమం సందర్శనం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, మెలానియా గుజరాత్‌లోని మెతెరా స్టేడియం చేరుకున్నారు.

వెంకన్న సన్నిధిలో పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు

‘సరస సంభాషణ’ దెబ్బకు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్.. ఎస్వీబీసీ చైర్మన్ పదవిని పోగొట్టుకున్న సంగతి తెలిసిందే.