Pawan Kalyan:ఒక్కసారి జనసేనను నమ్మండి.. ప్రజలకు పవన్ కల్యాణ్‌ విజ్ఞప్తి

  • IndiaGlitz, [Thursday,December 14 2023]

ఒక్కసారి జనసేనకు అవకాశం ఇవ్వండని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాను ఒక్కసారి మాటిస్తే వెనక్కి వెళ్లనని మీకు అండగా ఉంటాను అని హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్రకు చెందిన మైనారిటీ నాయకుడు సాధిక్, ప్రకాశం జిల్లా దర్శికి చెందిన గరికపాటి వెంకట్ ఆయన సమక్షంలో జనసేనలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారిందని.. దిక్కు లేకుండా పోయిందని వాపోయారు. గత తొమ్మిదేళ్లుగా జనసేన అనేక ఒడిదొడుకులు ఎదుర్కొని ఇక్కడి దాకా వచ్చిందని.. వైసీపీ లాంటి గూండా నాయకులను ధీటుగా ఎదుర్కోగలుగుతున్నామని తెలిపారు. అందుకు యువత తనకు అండగా నిలవడమే కారణమన్నారు.

బీజేపీతో కలిసి ఉండటం వల్ల రాలేకపోతున్నట్టు కొందరు ముస్లింలు చెబుతున్నారని.. మత వివక్ష చూపించనని మాట ఇస్తున్నానని పేర్కొన్నారు. ముస్లింలను మైనార్టీ ఓటు బ్యాంకుగా చూడనని. మైనార్టీలకు అన్యాయం జరిగితే సాటి మనిషిగా నిలబడతానని హామీ ఇచ్చారు. కులం, మతాన్ని దాటి వచ్చా.. మానవత్వాన్ని నమ్మానని చెప్పారు. ప్రకాశం జిల్లా వైసీపీ నాయకులు గనులు తవ్వుకుని వెళ్లిపోతున్నారు తప్ప జిల్లా అభివృద్ధికి నాయకులు కృషి చేయడం లేదని ఆరోపించారు. ప్రకాశం జిల్లా, ఉత్తరాంధ్రలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకూడదని పవన్ పిలుపునిచ్చారు.

ఇదిలా ఉంటే తెలంగాణలో పోటీ చేసిన జనసేనకు ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా రాలేదన్న సీఎం జగన్ విమర్శలపై జనసేన తీవ్రంగా స్పందించింది. సెల్ఫ్ గోల్ వేసుకోడంలో నిన్ను మించినోడు లేడు కదా సీబీఐ దత్తపుత్రా జగన్. 2014 తెలంగాణ ఎన్నికల్లో నీ పార్టీకి వచ్చిన ఓట్లు, తెలంగాణ ప్రజలు నిన్ను రాళ్లతో కొట్టిన తీరు మర్చిపోయావా? ఇండిపెండెంట్‌గా నిలబడి పోటీ చేసే దమ్ము బర్రెలక్కకైనా ఉంది కానీ, తెలంగాణలో పోటీ చేసే దమ్ము నీకు నీ పార్టీకి లేదు అని నువ్వే చెప్పుకుంటున్నట్టుంది అని కౌంటర్ ఎటాక్ చేస్తూ ట్వీట్ చేసింది.

More News

YS Jagan: వాళ్లది ఒక్కటే ఏడుపు.. చంద్రబాబు, పవన్‌పై సీఎం జగన్ విమర్శలు..

మీ బిడ్డ ప్రజలకు మంచి చేస్తుంటే చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు ఒక్కటే ఏడుస్తు్‌న్నారని ముఖ్యమంత్రి జగన్ విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో నిర్మించిన డా.వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్

Chadrababu: 150 సీట్లలో అభ్యర్థులను మార్చినా వైసీపీ గెలవదు.. చంద్రబాబు ఎద్దేవా

మూడు నెలల తర్వాత మీడియా ముందుకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇటీవల సీఎం జగన్ 11 నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జ్‌లను మార్చడంపై

SSC & Inter Exams: ఏపీలో పది, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..

ఏపీలో పది, ఇంటర్మీడియట్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. మార్చి నెలలో పరీక్షలు నిర్వహించబోతున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

Times Now Survey: టైమ్స్‌నౌ సర్వేలో వైసీపీ ప్రభంజనం.. ఫ్యాన్ గాలికి టీడీపీ హుష్‌ కాకి..

ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే వైసీపీ ప్రభంజనం సృష్టిస్తుందని టైమ్స్‌ నౌ నవజీవన్, ఈటీజీ సర్వేలో తేలింది.

షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు.. వైసీపీకి సీనియర్ నేతలు గుడ్ బై..?

ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. అటు వైసీపీ సామాజిక సాధికార యాత్రలు.. ఇటు చంద్రబాబు జిల్లాల పర్యటన, లోకేష్ యువగళం యాత్ర..