బాలీవుడ్‌కి అన‌సూయ... నిజ‌మెంత‌?

  • IndiaGlitz, [Monday,May 11 2020]

తెలుగు బుల్లితెర అభివృద్ధి చెందుతున్న త‌రుణంలో గ్లామ‌ర్ హంగులు అద్దిన తెలుగు యాంక‌ర్స్‌లో అన‌సూయ ముందు వ‌రుస‌లో ఉంటారు. ఈమె త‌ర్వాత ర‌ష్మీ గౌత‌మ్ ఉన్నారు. అయితే హాట్ యాంక‌ర్ ఇమేజ్ తీసుకొచ్చిన అన‌సూయ బుల్లితెర నుండి వెండితెర‌పై కూడా అడుగు పెట్టారు. ప‌లు చిత్రాల్లో కీల‌క పాత్ర‌లు, స్పెష‌ల్ సాంగ్స్‌లో న‌టించారు. అన‌సూయ న‌టించిన చిత్రాల్లో క్ష‌ణం, రంగ‌స్థ‌లం సినిమాల్లో అన‌సూయ పోషించిన పాత్ర‌ల‌కు చాలా మంచి పేరు వ‌చ్చింది. ఇప్పుడు ద‌ర్శ‌క నిర్మాత‌లు అన‌సూయ‌ను దృష్టిలో పెట్టుకుని పాత్ర‌ల‌ను క్రియేట్ చేస్తున్నారు.

బుల్లితెర‌, వెండితెర‌పై తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంట‌ర్‌టైన్ చేస్తున్న అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌.. ఇప్పుడు హిందీ ప్రేక్ష‌కుల‌కు మెప్పించ‌బోతున్నార‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. అయితే అన‌సూయ హిందీ సినిమాల్లో న‌టించ‌డం లేద‌ని, ఓ ప్ర‌ముఖ హిందీ సీరియ‌ల్‌లో న‌టించ‌బోతున్నార‌ని టాక్‌. అన‌సూయ‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా స‌ద‌రు సీరియ‌ల్ మేక‌ర్స్ ఆమెను సంప్ర‌దించార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న ఈ వార్త‌ల‌పై అనసూయ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా ఏమైనా రిప్లై ఇస్తారేమో చూడాలి.

More News

డేవిడ్ వార్నర్‌కు పూరీ అతిథి పాత్ర ఆఫర్..

కరోనా నేపథ్యంలో కేంద్రం విధించిన లాక్‌డౌన్‌తో సామాన్యుడి మొదలుకుని సెలబ్రిటీ వరకూ అందరూ ఇంటికే పరిమితం అయ్యారు.

దిల్ రాజ్ పెళ్లి చేసుకున్నది ఈమెనే.. ఫుల్ డీటైల్స్ ఇవీ..!

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి నిజామాబాద్‌లోని వెంక‌టేశ్వర స్వామి దేవాలయం వేదికగా ఈ వేడుక జరిగింది.

దిల్‌రాజు, ప్ర‌భాస్ చిత్రం... డైరెక్ట‌ర్ ఎవ‌రంటే?

బాహుబ‌లి సినిమాతో నేష‌న‌ల్ రేంజ్ స్టార్‌డ‌మ్‌ను సంపాదించుకున్న యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌తో సినిమా చేయ‌డానికి ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

శ్రీముఖి పుట్టినరోజు సందర్భంగా 'ఇట్స్ టైమ్ టు పార్టీ' ఫస్ట్ లుక్ విడుదల

బుల్లితెర రాములమ్మ, ప్రముఖ యాంకర్, 'బిగ్ బాస్ 3' ఫేమ్ శ్రీముఖి ముఖ్యమైన పాత్రలో నటించిన చిత్రం 'ఇట్స్ టైమ్ టు పార్టీ'. గౌతమ్ ఇ.వి.ఎస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

సినీ థియేటర్స్ ఓపెన్ చేస్తే ‘సీన్’ మారుతుంది!

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో సినిమా షూటింగ్స్, రిలీజ్‌లు.. థియేటర్స్ సర్వం బంద్ అయిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ 3.0లో చాలా సడలింపులు ఉన్నప్పటికీ థియేటర్స్‌ మాత్రం అందులో లేవ్.