నా ఆలోచ‌న‌ను దొంగ‌లించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు: దేవాక‌ట్ట‌

డైరెక్టర్ దేవాకట్ట ట్విట్టర్ వేదికగా ఓ నిర్మాత‌పై ఆరోప‌ణ‌లు చేశారు. దేవాక‌ట్ట ఎక్క‌డా ఆ నిర్మాత పేరుని ప్ర‌స్తావించ‌క‌పోయినా గ‌తంలో తాను చేయాల‌నుకున్న ఓ సినిమా పాయింట్‌ను అలాగే తస్క‌రించాన‌ని, ఈసారి అలా జ‌ర‌గ‌నివ్వ‌న‌ని ఆయ‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. ‘‘నేను వైఎస్ఆర్‌గారు, చంద్ర‌బాబు నాయుడుగారికి సంబంధించి ఓ ఎగ్జ‌యిటింగ్ స్క్రిప్ట్‌ను త‌యారు చేసుకున్నాను. ఈ స్క్రిప్ట్‌ను ఓ వ్య‌క్తి దొంగ‌లించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇంత‌కు ముందు కూడా ఈ వ్య‌క్తి నేను రాసుకున్న ఓ స్క్రిప్ట్‌ను త‌స్క‌రించి సినిమా తీస్తే అది డిజాస్ట‌ర్ అయ్యింది. ఇప్పుడు నేను వైఎస్ఆర్‌గారు, చంద్ర‌బాబుగారి మ‌ధ్య ఉండే స్నేహం రాజ‌కీయ వైరంగా ఎలా మారింద‌నే అంశాల‌తో ఫిక్ష‌నల్ స్క్రిప్ట్‌ను త‌యారు చేశాను.

2017లో ఈ క‌థ‌ను త‌యారు చేసుకున్నాను. మ‌ల్టీపుల్ వెర్ష‌న్స్‌ను కూడా రిజిష్ట‌ర్ చేయించాను. ఎక్క‌డో అక్క‌డ జ‌రిగే మాట‌ల సంద‌ర్భంలో మా ఐడియాను కొందరు హైజాక్ చేశారు. అయితే వారు ఇలా చేస్తే లీగ‌ల్ స‌మ‌స్య‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. హాలీవుడ్ మూవీ గాడ్‌ఫాద‌ర్‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను మూడు పార్టులుగా త‌యారు చేసుకున్నాను. త‌ర్వాత వెబ్ సిరీస్‌గా త‌యారు చేయాల‌నుకున్నాను. ఈ ఆలోచ‌న‌ను ప‌లు ఓటీటీ సంస్థ‌ల‌కు కూడా క‌లిసి చెప్ప‌డం జ‌రిగింది. అయితే ప్ర‌స్తుతం జ‌రుగుతున్న విష‌యంలో మా లీగ‌ల్ టీమ్ ద‌గ్గ‌రగా ఫాలో అవుతున్నారు’’ అని ట్వీట్ చేశారు దేవాక‌ట్ట‌.

More News

ఏపీకి గుడ్‌న్యూస్.. వచ్చే నెలలో కరోనా తగ్గుముఖం: డా. ప్రభాకర్‌రెడ్డి

ఏపీలో కరోనా ఉధృతి తీవ్ర స్థాయిలో ఉంది. ప్రతి రోజూ దాదాపు 10 వేల కేసులు నమోదవుతున్నాయి.

దేశంలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు.. 45వేల మందికి పైగా మృతి

దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ మధ్యకాలంలో ప్రతి రోజూ 50 వేలకు పైగానే కరోనా కేసులు నమోదవుతూ వస్తున్నాయి.

బాలీవుడ్‌కి ‘వినాయకుడు’.. కృష్ణుడి పాత్రలో..

భారీ బడ్జెట్‌.. భారీ అంచనాలతో వచ్చిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతుంటాయి. కానీ చిన్న బడ్జెట్‌తో

తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు... నేడు ఎన్నంటే..

తెలంగాణలో నిన్నటితో పోలిస్తే నేడు కరోనా కేసులు పెరిగాయి. తాజాగా కరోనా హెల్త్ బులిటెన్‌ను తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

ఎంట్రన్స్ పరీక్షల తేదీలు ఖరారు..

తెలంగాణలో ఎంట్రన్స్ టెస్టులను గతంలో ప్రభుత్వం వాయిదా వేసిన విషయం తెలిసిందే.