10th Class Results:తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. నిర్మల్ జిల్లా టాప్, సత్తా చాటిన గురుకుల పాఠశాలలు
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం జరిగిన కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 86.60 శాతం ఉత్తీర్ణత నమోదవ్వగా.. ఎప్పటిలాగే బాలురపై బాలికలు పై చేయి సాధించారు. 84.68 శాతం మంది బాలురు పాసవ్వగా.. 88.53 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించారు.
నిర్మల్ జిల్లాది అగ్రస్థానం:
99 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్ జిల్లా తొలి స్థానంలో నిలవగా.. వికారాబాద్ జిల్లా 59.46 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. 2,793 పాఠశాలల్లో వందకు వంద శాతం ఫలితాలు నమోదవ్వగా.. 25 పాఠశాలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రభుత్వ పాఠశాలల్లో 72.39 శాతం ఉత్తీర్ణత నమోదవ్వగా.. తెలంగాణ గురుకుల పాఠశాలలు 98.25 శాతం ఉత్తీర్ణతతో మెరుగైన ఫలితాలను సాధించాయి. జూన్ 14 నుంచి 22 వరకు టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.
ఒక రోజు వ్యవధిలోనే టెన్త్, ఇంటర్ ఫలితాలు :
కాగా.. ఈ ఏడాది ఏప్రిల్ 3 నుంచి 13 వరకు తెలంగాణలో పదో తరగతి పరీక్షలు జరిగాయి. మొత్తం 7,39,493 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరవ్వగా.. వీరిలో 2,43,186 మంది మంది బాలురు.. 2,41,184 మంది బాలికలు . పరీక్షలు జరిగిన కేవలం నెలలోపే ఫలితాలను విడుదల చేయడం విశేషం. నిన్ననే ఇంటర్ ఫలితాలను విడుదల చేసిన తెలంగాణ సర్కార్.. ఆ మరుసటి రోజే టెన్త్ ఫలితాలను కూడా ప్రకటించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout