close
Choose your channels

తెలంగాణలో కొలువుల జాతర: గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల, ఇంటర్వ్యూలు రద్దు.. మెరిట్‌తోనే ఎంపిక

Wednesday, April 27, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలంగాణలో 80,039 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని ఇప్పటికే సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన ఆదేశాల మేరకు తొలి విడతగా 30,453 ఖాళీల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ జీవోలు జారీ చేసింది. ఆ తర్వాత మరో 3,334 ఉద్యోగ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నియామక ప్రక్రియలో భాగంగా ఈరోజు గ్రూప్ -1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రం ఏర్పడ్డాక విడుదల చేసిన తొలి గ్రూప్-1 నోటిఫికేషన్ ఇదే. ఈ మేరకు మంగళవారం 503 పోస్టులకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. మే 2వ తేదీ నుంచి 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపింది. ప్రిలిమ్స్, మెయిన్స్‌లలో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను రద్దు చేసినట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

గ్రూప్-1కి సంబంధించి మొత్తం 19 రకాల పోస్టులు భర్తీ చేయనున్నారు. 900 మార్కులు రాత పరీక్ష నిర్వహించి.. మల్టీజోన్ల వారీగా అభ్యర్థులను సెలెక్ట్ చేయనున్నారు. రిజర్వేషన్లకు అనుగుణంగా మల్టీజోన్ల వారీగా మెయిన్స్‌కు ఎంపిక చేయనున్నారు. గ్రూప్-1లో ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేయనున్నారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మాధ్యమాల్లో పోటీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

పోస్టుల వివరాలు:

జిల్లా బీసీ అభివృద్ధి అధికారి - 5
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ - 40
అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ -38
అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీస్‌ - 20
డీఎస్పీ పోస్టులు - 91
జైళ్లశాఖలో డీఎస్పీ - 2
అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ - 8
జిల్లా ఉపాధి అధికారి - 2
జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి - 6
గ్రేడ్‌-2 మున్సిపల్‌ కమిషనర్‌ - 35
మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి - 121
జిల్లా పంచాయతీ అధికారి - 5
సీటీఓ పోస్టులు - 48
డిప్యూటీ కలెక్టర్లు - 42
అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ - 26
ప్రాంతీయ రవాణా అధికారి - 4
జిల్లా గిరిజన సంక్షేమ అధికారి - 2

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.