close
Choose your channels

టీఎస్సార్-టీవీ9 నేషనల్ అవార్డ్స్ 2017-18 గ్రహితలు వీరే..

Thursday, February 14, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టీఎస్సార్-టీవీ9 నేషనల్ అవార్డ్స్ 2017-18 గ్రహితలు వీరే..

టీఎస్సార్-టీవీ9 నేషనల్ అవార్డ్స్ 2017-18 ఏడాదికిగాను పలువురి పేర్లను టీఎస్సార్ లలితకళా పరిషత్ చైర్మన్ టి. సుబ్బిరామిరెడ్డి ప్రకటించారు. కాగా ఇలా అవార్డులు ప్రకటించడం ఇది ఐదోసారి. ప్రతీ ఏడాది పలువురు నటీనటులతో పాటు ఉత్తమ చిత్రాలు, గాయనీ గాయకులు, సంగీత దర్శకులు, దర్శకులను ఎంపిక చేసి గ్రాండ్‌‌గా అవార్డులు బహుకరిస్తారు. ఇదిలా ఉంటే.. టీవీ9 న్యూస్ చానెల్‌‌ ఎస్ఎంఎస్ ద్వారా, పలువురు నటీనటుమణులు, టెక్నీషియన్స్ నుంచి అభిప్రాయాలను సేకరించడం జరిగింది.

మరోవైపు.. జ్యూరీ సభ్యులైన టి సుబ్బిరామిరెడ్డి, శోభకామినేని, పింకిరెడ్డి, నటీమణులు నగ్మ, జీవితా రాజేశేఖర్, పరుచూరి గోపాలకృష్ణ, నరేశ్, కేఎస్ రామారావు, రఘురాం కృష్ణం రాజు అవార్డ్స్ ఎవరికివ్వాలి..? అనే విషయాలపై నిశితంగా చర్చించుకుని నిర్ణయం తీసుకున్నారు. ఫస్ట్ టైమ్‌‌ విశాఖపట్నం పోర్ట్‌‌లోని క్రికెట్ గ్రౌండ్స్‌‌లో 50వేల మందితో ఈ అవార్డుల ప్రధానోత్సవం జరపనున్నట్లు సుబ్బిరామిరెడ్డి తెలిపారు. కాగా.. ఈ అవార్డుల వేడుక ఫిబ్రవరి 17న 5గంటలకు జరగనున్నట్లు టీఎస్సార్ ఓ ప్రకటనలో తెలిపారు.

టీఎస్సార్-టీవీ9 2017 నేషనల్ ఫిల్స్ అవార్డు గ్రహితలు వీరే..

1. ఉత్తమ నటుడు : నందమూరి బాలకృష్ణ (గౌతమీపుత్ర శాతకర్ణి)
2. ఉత్తమ నటి : రకుల్ ప్రీత్‌సింగ్ (రారండోయ్ వేడుక చూద్దాం)
3. ఉత్తమ్ హీరోయిన్: రాశీఖన్నా (జై లవకుశ, రాజా ది గ్రేట్)
4. బెస్ట్ హీరోయిన్ (తొలిచిత్రం): షాలినీ పాండే (అర్జున్ రెడ్డి)
5. ఉత్తమ చిత్రం: గౌతమీపుత్ర శాతకర్ణి (రాజీవ్ రెడ్డి, సాయి బాబా)
6. అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం: ఖైదీ నంబర్. 150 (రామ్ చరణ్)
7. ఉత్తమ దర్శకుడు : క్రిష్ జాగర్లమూడి (గౌతమీపుత్ర శాతకర్ణి)
8. అత్యంత ప్రజాదరణ పొందిన దర్శకుడు: వి.వి వినాయక్ (ఖైదీనంబర్. 150)
9. ఉత్తమ పాత్ర నటుడు: ఆది పినిశెట్టి (నిన్నుకోరి)
10. ఉత్తమ సంగీత దర్శకుడు: దేవీ శ్రీ ప్రసాద్ (ఖైదీ నంబర్ 150)
11. ఉత్తమ గాయకుడు: దేవీ శ్రీ ప్రసాద్ (అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు- ఖైదీ నంబర్ 150)
12. ఉత్తమ గాయని : మధు (వచ్చిండే.. ఫిదా)
13. స్పెషల్ జ్యురీ అవార్డ్ : రాజశేఖర్ (పీఎస్వీ గరుడవేగ)
14. స్పెషల్ జ్యురీ అవార్డ్ : సుమంత్ (మళ్లీరావా)
15. స్పెషల్ జ్యురీ అవార్డ్ : అఖిల్ (హలో)
16. స్పెషల్ జ్యురీ అవార్డ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్: నరేశ్ వీకే (శతమానం భవతి)
17. స్పెషల్ జ్యురీ అవార్డ్ : రితికా సింగ్ (గరు)
18. స్పెషల్ జ్యురీ అవార్డ్- ఫిల్మ్: ఫిదా (దిల్ రాజు, శిరీష్)
19. స్పెషల్ జ్యురీ అవార్డ్ సింగర్: మనో (పదమరి, పైసా వసూల్)
20. స్పెషల్ జ్యురీ అవార్డ్ సింగర్ : సోనీ (హంసవాహనా.. బాహుబలి-2)
21. స్పెషల్ జ్యురీ అవార్డ్- దర్శకుడు : దివంగత బి. జయ (వైశాఖం)

టీఎస్సార్-టీవీ9 2018 నేషనల్ ఫిల్స్ అవార్డు గ్రహితలు వీరే..

1. ఉత్తమ నటుడు: అక్కినేని నాగార్జున (దేవదాసు)
2. ఉత్తమ హీరో: రంగస్థలం (రామ్ చరణ్)
3. ఉత్తమ హీరో (తొలిచిత్రం): కల్యాణ్ దేవ్ (విజేత)
4. ఉత్తమ పాత్రధారుడు: రాజేంద్రప్రసాద్ (మహానటి)
5. ఉత్తమ హాస్యనటుడు: అలీ (నేలటిక్కెట్టు)
6. ఉత్తమ నటి: కీర్తి సురేశ్ (మహానటి)
7. ఉత్తమ నటీమణి: పూజా హెగ్దే (అరవింద సమేత)
8. ఉత్తమ నటి (తొలిచిత్రం): ప్రియాంక జవాల్కర్ (టాక్సీ వాలా)
9. ఉత్తమ చిత్రం: మహానటి (అశ్వనీదత్, ప్రియాంక, స్వప్న దత్)
10. అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం: రంగస్థలం (నవీన్, రవిశేఖర్, మోహన్)
11. ఉత్తమ దర్శకుడు: నాగ్ అశ్విన్ (మహానటి)
12. ఉత్తమ బాల నటుడు: సాయి తేజస్విని (మహానటి)
13. అత్యంత ప్రజాదరణ పొందిన దర్శకుడు: సుకుమార్ (రంగస్థలం)
14. ఉత్తమ దర్శకుడు (తొలిపరిచయం): వెంకీ అట్లూరి (తొలిప్రేమ)
15. ఉత్తమ సంగీత దర్శకుడు: ఎస్ఎస్ థమన్ (అరవింద సమేత)
16. ఉత్తమ గాయకుడు: అనురాగ్ కులకర్ణి (మహానటి)
17. ఉత్తమ గాయని: గంటా వెంకటలక్ష్మి (జిగేల్ రాణి- రంగస్థలం)
18. స్పెషల్ జ్యురీ అవార్డ్ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (జయజానకీ నాయకా)
19. స్పెషల్ జ్యురీ అవార్డ్ : నాగ చైతన్య (శైలాజరెడ్డి అల్లుడు)
20. స్పెషల్ జ్యురీ అవార్డ్ : కల్యాణ్ రామ్ (నా నువ్వే)
21. స్పెషల్ జ్యురీ అవార్డ్ : సుప్రియ (గూడాఛారి)
22. స్పెషల్ జ్యురీ అవార్డ్-దర్శకుడు: పరశురాం (గీతాగోవిందం)
23. స్పెషల్ జ్యురీ అవార్డ్- చిత్రం: తొలిప్రేమ (బీవీఎస్ఎన్ ప్రసాద్)
24. స్పెషల్ జ్యురీ అవార్డ్-గాయని: మోహన్ బోగరాజు (అరవింద సమేత)

ఇతర భాషల్లో ఉత్తమ చిత్రాలు..

1. ఉత్తమ నటి: పద్మావత్
స్పెషల్ జ్యురీ అవార్డ్ : (తెలుగు) సమ్మోహన్ అతిథిరావ్ హైదరి
2. అత్యుత్తమ ప్రదర్శన నటి: కుష్బూ (తమిళ్)
3. ఉత్తమ తమిళ నటి: కేథరిన్ థెరిసా (కథానాయకన్-2017)
4. ఉత్తమ కన్నడ నటి: ప్రియమణి (ధ్వజ-2018)
5. ఉత్తమ పంజాబి నటి: జోనిత (శాంకీ దరోగా-2018)
6. ఉత్తమ్ నటుడు-బోజ్‌పురి: రవికిషన్ (శహన్షా-2017)

స్పెషల్ అవార్డ్స్

1. నేషనల్ స్టార్ శ్రీదేవి మెమోరియల్ అవార్డ్: విద్యాబాలన్
2. దాసరి నారాయణరావు మెమోరియల్ అవార్డ్: మోహన్‌‌బాబు
3. స్టార్ ప్రొడ్యూసర్ అవార్డ్: భోనీ కపూర్
4. లైఫ్ టైమ్‌‌ అచ్యుమెంట్ అవార్డ్: నగ్మ
5. ఔట్ స్టాండింగ్ సినీ లిరిక్ రైటర్ అవార్డ్ : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
6. జ్యూరీ అవార్డ్ ‘86 వసంతాల తెలుగు సినిమా’ బుక్ రచయిత- డాక్టర్ కే ధర్మారావ్

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.