హనుమంతుడి జన్మస్థానం తిరుమలేనట..

  • IndiaGlitz, [Friday,April 09 2021]

హనుమంతుడి జన్మస్థానంపై రకరకాల కథనాలు వినిపిస్తున్నప్పటికీ దానికి శాస్త్రీయ ఆధారాలైతే ఏమీ లేవు. కానీ తాజాగా ఆయన జన్మస్థలం శాస్త్రీయ ఆధారాలతో సహా నిరూపించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధమైంది. ఇంతకీ అంజనీసుతుని జన్మస్థలం ఏంటో తెలుసా? సాక్షాత్తు.. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కొలువైన తిరుమలేనట. దీనిని ఆధారాలతో సహా ఈ నెల 13న ఉగాది పర్వదినం సందర్భంగా నిరూపిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేస్తోంది. అంజనాద్రి కొండలో హనుమంతుడు జన్మించాడనే విషయాన్ని ఆధారాలతో నిరూపించేందుకుగాను గతేడాది డిసెంబర్‌లో పండితులతో టీటీడీ కమిటీ ఏర్పాటు చేసింది.

ఈ కమిటీతో గురువారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో టీటీడీ ఈవో డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి సమావేశమయ్యారు. అంజనాద్రిలోనే హనుమంతుడు జన్మించాడని రుజువు చేసేందుకు బలమైన ఆధారాలు సేకరించినట్లు కమిటీ సభ్యులు ఈవోకు తెలిపారు. ఇంకేముంది ఈ విషయాన్ని నిరూపించేందుకు 13న తాము సేకరించిన ఆధారాలతో కమిటీ సభ్యులు సిద్ధమవుతున్నారు. దీనికి ఆధారాలుగా.. శివ, బ్రహ్మ, బ్రహ్మాండ, వరాహ, మత్స్య పురాణాలు, వేంకటాచల మహత్య గ్రంథం, వరాహమిహిరుని బృహత్‌సంహిత గ్రంథాలను కమిటీ సభ్యులు సూచిస్తున్నారు. దీంతో హనుమంతుని జన్మస్థలంపై పూర్తి క్లారిటీ వచ్చినట్టే.

కమిటీ సభ్యులు సూచించిన దాని ప్రకారం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి చెంత ఉన్న అంజనాద్రి కొండే ఆంజనేయుని జన్మస్థానమని చెబుతున్నారు. అలాగే యుగం, తేదీ ప్రకారం నిర్థారించిన అంశాలను కమిటీ సభ్యులు ఈవోకు వివరించారు. తాజాగా దీనిపై టీటీడీ ఈవో మాట్లాడుతూ.. తిరుమల ఇక నుంచి హనుమంతుని జన్మస్థానంగా కూడా గుర్తింపు పొందనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ఉగాది పర్వదినం రోజున జ్యోతిష్య శాస్త్రం, శాసనాలు, పురాణాలు, శాస్త్రీయ ఆధారాలతో సహా ప్రజలకు తెలపాలని కోరారు. హనుమంతుని జన్మస్థానం అంజనాద్రి అని నిరూపించేందుకు ఉన్న ఆధారాలు, ఇతర వివరాలతో త్వరలో సమగ్రమైన పుస్తకాన్ని తీసుకురావాలని చెప్పారు.

More News

దేశంలో ఆందోళనకరంగా విస్తరిస్తున్న కరోనా.. నిన్న ఒక్కరోజే..

కరోనా సెకండ్ వేవ్ దేశంలో విపరీతంగా విస్తరిస్తోంది. గుండెల్లో దడ పుట్టిస్తోంది.

‘వకీల్ సాబ్’కు వెళ్లి.. రచ్చ రచ్చ చేసిన దిల్ రాజు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన‘వకీల్ సాబ్‌' సినిమా నేడు(శుక్రవారం) ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిందే.

లాక్‌డౌన్‌పై క్లారిటీ ఇచ్చిన మోదీ

కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. గత ఏడాదిని మించి ఈ ఏడాది కేసులు నమోదవుతున్నాయి.

‘లవ్ స్టోరీ’ రిలీజ్ విషయంలో అనూహ్య నిర్ణయం..

కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని గడగడలాడిస్తోంది. కేసుల సంఖ్య తీవ్ర స్థాయిలో పెరుగుతుండటంతో ఆ ఎఫెక్ట్ సినిమాల విడుదలపై కూడా పడుతోంది.

ఒక రాత్రిలో జరిగే ఎమోషనల్‌ థ్రిల్లర్ 'లెవన్త్‌అవర్‌' : ప్రవీణ్‌ సత్తారు

చందమామ కథలు, గుంటూరు టాకీస్‌, పిఎస్‌వి గరుడవేగ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలతో డైరెక్టర్‌గా తనదైన మార్క్‌ క్రియేట్‌ చేసిన దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు