మంత్రి వార్నింగ్.. గంటల్లోనే టీటీడీ చైర్మన్ రాజీనామా!

  • IndiaGlitz, [Wednesday,June 19 2019]

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ బుధవారం నాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల వెంకన్నను దర్శించుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇంత వరకూ పాలకమండలికి రాజీనామా చేయని సభ్యులు, చైర్మన్‌లకు కాసింత వార్నింగ్ ఇచ్చినట్లుగా మాట్లాడారు. నామినెటెడ్ పదవులకు స్వతంత్రంగా రాజీనామా చేస్తే సరే లేకుంటే.. ఆర్డినెన్స్ ద్వారా టీటీడీ పాలకమండలిని రద్దు చేస్తామని తేల్చిచెప్పేశారు. అది కూడా తిరుమల శ్రీవారి సన్నిధిలోనే మంత్రి ప్రకటించారు. మంత్రి ఈ మాటలు మాట్లాడిన కొన్ని గంటల్లోనే టీటీడీ చైర్మన్ పదవికి పుట్టా సుధాకర్ యాదవ్ రాజీనామా చేయడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది.

నాడు మొండి.. నేడు రాజీనామా..!

కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత పలువురు టీడీపీ నేతలు స్వతంత్రంగా తమ నామినెటెడ్ పదవులు వదులుకున్నారు. అంతేకాదు టీటీడీ పాలకమండలి సభ్యులు సైతం తప్పుకున్నారు. అందరూ ఇలా రాజీనామాలు చేస్తున్నప్పటికీ టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ మాత్రం మొండికేసి తాను రాజీనామా చేయబోనని.. దైవ సాక్షిగా ప్రమాణం చేశానని తననే చైర్మన్‌గా కొనసాగించాలని కొత్త ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఇందుకు స్పందించిన వైసీపీ నేతలు కొందరు.. మెడపట్టి బయటికి గెంటించుకునే పరిస్థితులు తెచ్చుకోవద్దని ఎవరికి వారుగా.. హుందాగా రాజీనామా చేస్తే మంచిదని కాసింత ఘాటుగానే మాట్లాడారు.

ఇవ్వాల్సినోళ్లు ఇస్తేనే..!

ఇవాళ.. దేవదాయశాఖ మంత్రి తిరుమలను దర్శించుకుని అలా మీడియా ముందుకు వచ్చారో లేదో.. కొన్ని గంటల్లోనే పుట్టా రాజీనామా చేసేశారు. అంటే ఏదైనా చెప్పేవాళ్లు చెబితేనే.. ఇవ్వాల్సినవి ఇస్తేనా తిక్క కుదురుతుందా..? ఇప్పుడు బాగుంది కదా..? అని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వైసీపీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు.. ఇంకా పలువురు పలు నామినెటెడ్ పోస్టులకు రాజీనామా చేయలేదని.. వాళ్లకు కూడా బొట్టు పెట్టి మరీ చెప్పాలా..? అంటూ వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

మంచి రోజుకోసం సుబ్బారెడ్డి వెయిటింగ్!

కాగా.. టీటీడీ చైర్మన్‌గా వైఎస్ జగన్ బాబాయ్, వైసీపీ కీలకనేత, వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించిన.. వైవీ సుబ్బారెడ్డి పేరు కన్ఫామ్ అయిన సంగతి తెలిసిందే. ఈ చైర్మన్ పదవిపై ఇప్పటికే సుబ్బారెడ్డి కూడా స్పందిస్తూ నిజమేనని తేల్చారు. అయితే ఈ నెల చివరికల్లా నామినెటెడ్ పదవుల పంపకం జరుగుతుందని.. అప్పుడు సుబ్బారెడ్డి మంచి రోజు చూసుకుని టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని తెలుస్తోంది.

More News

ఫొటో తెచ్చిన తంటా.. జగన్ వర్సెస్ బాలయ్య ఫ్యాన్స్.. ఫైనల్‌గా..!

రెండ్రోజులుగా సోషల్ మీడియా వేదికగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ నటుడు నందమూరి బాలయ్య

దాసరి కొడుకు ప్రభు అచూకి లభ్యం...

ఆరు రోజుల క్రితం మిస్సయిన దాసరి నారాయణరావు పెద్ద కుమారుడు దాసరి ప్రభు ఆచూకీ లభ్యమైంది.

సీమ రెడ్లంతా టీడీపీకి టాటా చెప్పబోతున్నారా.. వాట్ నెక్ట్స్‌!?

రాయలసీమలోని టీడీపీకి చెందిన రెడ్లంతా పార్టీకి టాటా చెప్పేసేందుకు సిద్ధమవుతున్నారా..? అన్నీ అనుకున్నట్లు జరిగితే అటు బీజేపీలోకి కొందరు..

'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' ప్రీ రిలీజ్‌

న‌వీన్ పొలిశెట్టి, శృతి శ‌ర్మ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ‌’.

సందీప్ కిషన్ కోసం నటులుగా మారిన దర్శకులు

సందీప్ కిషన్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం 'నిను వీడని నీడను నేనే'. కార్తీక్ రాజు దర్శకుడు. ఏకే ఎంట్టైన్మెంట్స్ పతాకంపై