TTD:శ్రీవారి భక్తులకు అలర్ట్ : తిరుమలలో ఆర్జిత సేవలు, దర్శన టికెట్లకు షెడ్యూల్ విడుదల.. ఇకపై ప్రతినెలా ఆ తేదీల్లోనే
Send us your feedback to audioarticles@vaarta.com
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సౌలభ్యం కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీ వేంకటేశ్వరుడి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల బుకింగ్ కోసం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం ప్రతి నెలా 18 నుంచి 20వ తేదీ వరకు సుప్రభాతం, అర్చన, అష్టదళ పాదపద్మారాధన తదితర ఆర్జిత సేవల లక్కీ డిప్ కోసం భక్తులు ముందుగా నమోదు చేసుకోవాల్సి వుంటుందని టీటీడీ వెల్లడించింది. లక్కీ డిప్‌లో టికెట్లు పొందిన భక్తులు.. ప్రతి నెలా 20వ తేదీ నుంచి 22 లోపు నిర్ధేశిత రుసుము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి వుంటుందని పేర్కొంది.
ఈ నెల 24న రూ.300 దర్శన టికెట్ల కోటా విడుదల :
ఇకపోతే.. కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవలతోపాటు వర్చువల్ సేవా టికెట్లను ఈ నె 21వ తేదీన విడుదల చేస్తామని టీటీడీ ప్రకటించింది. శ్రీవాణి, ఆంగ ప్రదక్షిణం, వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్లు మే 23న విడుదల చేస్తామని పేర్కొంది. అదే విధంగా రూ.300/- దర్శన టికెట్ల కోటాను 24న విడుదల చేస్తామని తెలిపింది. తిరుపతిలో గదుల కోటాను 25న, తిరుమలలో గదుల కోటాను 26న విడుదల చేస్తామని టీటీడీ స్పష్టం చేసింది.
ఈ డేట్స్ చూసుకుని టికెట్లు బుక్ చేసుకోవాలి :
అయితే ఒకవేళ ఆర్జిత సేవా టికెట్లు, దర్శన టికెట్ల జారీ తేదీ ఆదివారం వస్తే వాటిని మరుసటి రోజు విడుదల చేస్తామని టీటీడీ క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు.. ఇకపై ప్రతి నెలా శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను షెడ్యూల్‌లో ప్రకటించిన తేదీల్లోనే బుక్ చేసుకోవాలని భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం సూచించింది.
శ్రీవారి దర్శనానికి 24 గంటలు:
మరోవైపు.. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ పరిసరాలు, క్యూ కాంప్లెక్స్‌లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. టోకెన్లు లేని భక్తుల శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోందని, నిన్న స్వామి వారిని 77,436 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ స్పష్టం చేసింది. అలాగే శ్రీవారి హుండీకి రూ.3.77 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments