close
Choose your channels

టీవీ నటికి అక్రమ సంబంధం.. దారుణ హత్య!

Friday, February 14, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు క్షణికావేశంలో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అంతేకాదు.. అంతకంటే ఎక్కువగా మోసపోవడం.. అక్రమ బంధాల వల్ల కూడా ఆత్మహత్యలు, దారుణ హత్యలకు గురవుతున్నారు. ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయి. అవన్నీ ఇక్కడ అసందర్భం.. అప్రస్తుతం. తాజాగా.. పంజాబ్‌కు చెందిన ఓ టీవీ నటి తన భర్త చేతిలో దారుణ హత్యకు గురైంది. అసలేం జరిగింది..? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

అసలేం జరిగింది!?
పంజాబ్‌‌కు చెందిన అనితా సింగ్‌ (29), రవీందర్‌సింగ్‌ పాల్‌ ఇద్దరూ భార్యాభర్తలు. భార్య అనితకు నటన అంటే మక్కువతో టీవీ సీరియళ్లలో నటిస్తోంది. అంతా సాఫీగా సాగుతున్న ఈ కుటుంబంలోకి అనుమానం అనే పెనుభూతం చొరబడింది. ఈ క్రమంలో దంపతుల మధ్య విభేదాలు తలెత్తి అవి గొడవలు, హత్య దాకా దారితీశాయి. భార్య మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని.. అందుకే తనను దూరంగా పెడుతోందని రవీందర్ భావించి.. ఇక ఆమెను బతకనివ్వకూడదని హతమార్చాలని ప్లాన్ చేశాడు. తనకు బాగా సన్నిహితంగా ఉండే మిత్రుడు కుల్దీప్‌తో కలిసి స్కెచ్ వేశాడు.

స్కెచ్ ఇలా..!?
తన మిత్రుడు కుల్దీప్‌కు బాలీవుడ్‌లో మంచి పరిచయాలున్నాయని.. ఆయన్ను కలిస్తే అవకాశాలు ఇప్పిస్తాడని అనితను భర్త నమ్మించాడు. తనతో ఉత్తరాఖండ్‌‌‌కు అనితను తీసుకెళ్లాడు. అనంతరం ముగ్గురూ కలిసి ఓ ప్రముఖ హోటల్‌లో దిగి.. మొదట భోజనం చేశారు. అనంతరం ఓ కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి దాన్ని అనితకు ఇచ్చారు. అది తాగ్గానే ఆమె స్పృహా కోల్పోయింది. అనంతరం ఆ హోటల్ దగ్గర్నుంచి బండిలో అడవుల్లోకి తీసుకెళ్లి గొంతు నులిమి చంపారు. అనంతరం తాము పోలీసులు ఎక్కడా దొరక్కుండా ఉండాలని మృతదేహంపై పెట్రోలు పోసి తగలబెట్టేశారు.

ఇలా బయటపడింది!
రోజులు గడుస్తున్నా సినిమా అవకాశాలకు వెళ్లిన కుమార్తె ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు అసలేం జరిగిందని ఆరా తీయగా.. అసలు విషయం బయటపడింది. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకున్న పోలీసులు రవీందర్.. ఆయన మిత్రుడు కుల్దీప్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.