close
Choose your channels

టీవీ యాంకర్ శాంతి అనుమానాస్పద మృతి.. ఫోన్ స్వాధీనం!

Thursday, April 9, 2020 • తెలుగు Comments

టీవీ యాంకర్ శాంతి అనుమానాస్పద మృతి.. ఫోన్ స్వాధీనం!

ప్రముఖ తెలుగు టీవీ యాంకర్‌, సీరియల్‌ నటి శాంతి (విశ్వశాంతి) అనుమానస్పదంగా మృతి చెందారు. నగరంలోని ఎస్సార్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న ఎల్లారెడ్డి గూడెం ఇంజనీర్స్‌ కాలనీలోని తన నివాసంలో ఆమె శవమై కనిపించారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకున్నారా? లేదా ఎవరైనా చంపేశారా..? కుటుంబ సభ్యులు ఇబ్బందిపెట్టడంతో చనిపోయారా..? ఇంకా ఏమైనా కారణాలున్నాయా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. మరోవైపు ఆమె గత కొన్నిరోజులు కుటుంబ సభ్యులతో ఎలా ఉండేది..? గొడవలు ఏమైనా ఉన్నాయా..? అని ఆమె ఇంటి చుట్టుపక్కల ఉండేవారిని కూడా పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. శాంతి ఇక లేరన్న విషయం తెలుసుకున్న పలువురు టీవీ నటులు, టాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అసలేం జరిగింది..!?

కాగా.. గత నాలుగైదు రోజులుగా శాంతి తన గదిలో నుంచి బయటికి రాలేదని.. ఏదైనా గొడవ జరిగి ఉండొచ్చేమోనని స్థానికులు, అపార్ట్‌మెంట్ వాసులుచెబుతున్నారు. ఆమె ఇంట్లో నుంచి బయటికి రాకపోవడంతో ఏదో జరిగిందన్న అనుమానంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా శవమై కనిపించారు. మరోవైపు ఇంట్లో నిశితంగా తనిఖీలు చేసిన పోలీసులు ఆమె ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాల్‌డేటా, ఇంటి పరిసరాల్లో ఉండే సీసీ పుటేజీల ఆధారంగా అసలేం జరిగిందో తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. మరోవైపు పోస్ట్‌మార్టం నిమిత్తం శాంతి మృతదేహాన్ని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఆ రిపోర్ట్ ద్వారా కూడా క్లూ దొరికే అవకాశముందని పోలీసులు చెబుతున్నారు.పోస్టు మార్టం రిపోర్ట్ ఆధారంగా విచారణ చేపడతామని పోలీసులు పేర్కొన్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz