close
Choose your channels

EAMCET Web Counselling: వెబ్ కౌన్సెలింగ్‌లలో ఆప్షన్లు ఎలా నమోదు చేసుకోవాలి...ఈ ఎడ్యుకేషన్ సమ్మిట్ మీ కోసమే

Wednesday, June 7, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విద్యార్ధుల జీవితాల్లో ఇంటర్, డిగ్రీలు కీలకమైన దశలు. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు, వేసే అడుగులే భవిష్యత్తును నిర్దేశిస్తాయి. ఒక్క తప్పటడుగు వేసినా మొత్తం జీవితమే అంధకారంతో నిండిపోతుంది. అందుకే ఆ సమయంలో పెద్దలు, గురువులు, సన్నిహితుల సలహాలు తీసుకోవడం ముఖ్యం. కెరీర్‌లో ఎన్నో ఆప్షన్లు, మన కలలు కలగలిసి వుండటంతో కోర్సు ఎంపిక చేసుకోవడంలో తికమకపడిపోతుంటారు. చదవాలా, ఉద్యోగం చేయాలా అనే అయోమయం నుంచి బయటపడితే జీవితంలో ముందుకు సాగిపోవచ్చు.

ఇలా కన్‌ఫ్యూజన్‌లో వున్న ఇంటర్, డిగ్రీ విద్యార్ధుల కోసమే ‘‘ టీవీ9 - కేఏబీ ఎడ్యుకేషన్ సమ్మిట్ 2023’’ . టీవీ9, కేఏబీ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ సంయుక్తంగా నిర్వహించిన ఎడ్యుకేషన్ సమ్మిట్ 2023 ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నంలలో జరిగింది. తద్వారా వేలాది మంది విద్యార్ధులకు తమ కెరీర్ గురించి మంచి అవగాహన కల్పించింది. ఇప్పుడు ఈ సమ్మిట్‌కు హైదరాబాద్‌ వేదికైంది. నిజాం కాలేజ్ గ్రౌండ్స్‌లో జూన్ 9, 10, 11 తేదీల్లో ఈ సమ్మిట్ జరగనుంది.

ఇంటర్ , డిగ్రీ తర్వాత కెరీర్‌లను ఎలా ప్లాన్ చేసుకోవాలనే సందిగ్థంలో వున్న విద్యార్ధులకు టీవీ9 - కేఏబీ ఎడ్యుకేషన్ సమ్మిట్ ఓ సువర్ణావకాశంగా దోహదపడుతుంది. ఎన్నో ప్రఖ్యాత కాలేజీలు, యూనివర్సిటీలు పాల్గొనే ఈ ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో విద్యార్ధులు ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్, మెడిసిన్, కామర్స్, కంప్యూటర్స్, యానిమేషన్, బిజినెస్ మేనేజ్‌మెంట్, హోటల్ మేనేజ్‌మెంట్‌తో పాటు ఇంకా ఎన్నో రకాల కోర్సులు, ఆయా రంగాల్లో వున్న ఉద్యోగావకాశాల గురించి తెలుసుకోవచ్చు. అలాగే విద్యార్ధులు తమకు ఇష్టమైన కెరీర్‌ను ఎంచుకునే విషయంలో నిపుణుల సలహాలు, సూచనలు పొందవచ్చు. అంతేకాకుండా ప్రతిష్టాత్మక ఎంట్రన్స్ టెస్టులైన ఎంసెట్, నీట్, JOSAA, ECETలకు ఎలా సన్నద్ధం కావాలి, వెబ్ కౌన్సెలింగ్‌లలో ఆప్షన్లు ఎలా నమోదు చేసుుకోవాలనే దానిపై నిపుణుల నుంచి సూచనలు పొందవచ్చు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.