మ‌హేశ్ వ‌ర్సెస్ విజ‌య్ ..ట్విట్ట‌ర్ వార్‌

  • IndiaGlitz, [Wednesday,April 01 2020]

సోష‌ల్ మీడియా పెరిగిన త‌ర్వాత హీరోలు అభిమానులకు చేరువ‌య్యారు. అలాగే ఫ్యాన్స్ మ‌ధ్య వార్స్ కూడా ఎక్కువ‌య్యాయి. మా హీరో గొప్ప అంటే కాదు.. మా హీరో గొప్ప అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఒక‌రినొక‌రు దూషించుకుంటున్నారు. ఓ హీరో అభిమానులు మ‌రో హీరోని కించ‌ప‌రుస్తున్నారు. ఒక‌ప్పుడు ఫ్యాన్స్ మ‌ధ్య వార్ అనేది ఓ భాష‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మై ఉండేది. కానీ సోష‌ల్ మీడియా పుణ్య‌మాని ఇప్పుడు ప‌ర‌భాషా ఫ్యాన్స్ మ‌ధ్య గొడ‌వ‌లు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సోష‌ల్ మీడ‌దియా వార్ క‌ల్చ‌ర్ కోలీవుడ్‌లో ఎక్కువ‌గా ఉంటుంది. విజ‌య్‌, అజిత్ అభిమానులు గొడ‌వ‌లు ప‌డుతుంటారు. కానీ ఇప్పుడు హ‌ద్దుల దాటుతున్నారు.

ఇటీవ‌ల ఎన్టీఆర్ అభిమానులు, విజ‌య్ అభిమానుల‌కు మ‌ధ్య సోష‌ల్ మీడియా వార్ జ‌రిగింది. ఇప్పుడు టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు, కోలీవుడ్ సూప‌ర్‌స్టార్ విజ‌య్ అభిమానుల మ‌ధ్య ట్విట్ట‌ర్ వార్ ఓ రేంజ్‌లో జ‌రుగుతుంది. డమ్మీస్టార్ మ‌హేశ్ అంటూ విజ‌య్ అభిమానులు మ‌హేశ్‌ను ట్రోల్ చేస్తుంటే.. మ‌హేశ్ అభిమానులు ఊరుకుంటారా? రీమేక్ స్టార్ విజ‌య్ అంటూ విజ‌య్‌ను ట్రోల్ చేస్తున్నారు మ‌హేశ్ అభిమానులు. మ‌రి ఈ స్టార్ వార్‌కు ముగింపెప్పుడో చూడాలి.

More News

ఇద్ద‌రు బాలీవుడ్ భామ‌ల్లో మ‌హేశ్‌తో న‌టించేదెవ‌రో?

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ 27వ సినిమాకు సంబంధించిన కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ప్రారంభం కావాల్సిన ఈ సినిమా, మ‌హేశ్‌కి క‌థ న‌చ్చ‌క‌పోవ‌డంతో ఆగిపోయింది.

కరోనా నేపథ్యంలో జియో, వొడాఫోన్ కస్టమర్స్‌కు తీపికబురు

కరోనా నేపథ్యంలో ఇండియా మొత్తం లాక్‌డౌన్‌లో ఉండటంతో టెలికాం సంస్థలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. లాక్‌డౌన్‌ కాలంలో తమ వినియోగదారులు ఇబ్బంది పడకూడదని సదరు

రాజ‌మౌళి 'ఆర్ఆర్ఆర్‌' ఆ సినిమాకు కాపీనా ?

ర్శ‌క‌ధీరుడుగా పేరున్న రాజ‌మౌళి ప్ర‌స్తుతం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌తో ‘రౌద్రం ర‌ణం రుధిరం’ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. రీసెంట్‌గా విడుద‌లైన మోష‌న్ పోస్ట‌ర్‌,

ఢిల్లీకెళ్లిన తెలంగాణ సచివాలయ ఉద్యోగికి కరోనా

దేశ రాజధాని ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో జరిగిన మత సదస్సులో పాల్గొన్న ముస్లింలకు కరోనా భయం మొదలైంది. మరీ ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో ‘కరోనా పాజిటివ్‌’గా తేలిన వారిలో

రాజ‌మౌళి కుటుంబానికి సినీ కార్మికుల గోడు ప‌ట్ట‌దా?

ప్ర‌పంచ‌మంతా క‌రోనా వైర‌స్‌(కోవిడ్ 19) ప్ర‌భావంతో విల‌విల‌లాడుతోంది. సినీ రంగం విష‌యానికి వ‌స్తే.. షూటింగ్స్ ఆగిపోయాయి. దీని వ‌ల్ల స్టార్స్‌కు వ‌చ్చిన స‌మ‌స్య‌లేమీ లేవు.