ట్రూ సక్సెస్ దిశగా 'టు ఫ్రెండ్స్' 

  • IndiaGlitz, [Saturday,October 27 2018]

అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వంటి పలు రంగాల్లో అద్భుతాలు ఆవిష్కరించి, రాయలసీమ ముద్దు బిడ్డగా, అనంతపురం ఆణిముత్యంగా అభివర్ణించబడే బహుముఖ ప్రజ్ఞాశాలి ముళ్ళగూరు ఆనంతరాముడు.. సినీ రంగ ప్రవేశం చేసి, నిర్మించిన వినోదభరిత వైవిధ్య కథా చిత్రం 'టు ఫ్రెండ్స్'. ట్రూ లవ్ అనేది ఉప శీర్షిక.

ఆనంతలక్ష్మి క్రియేషన్స్ పతాకంపై.. ముళ్లగూరు లక్ష్మీదేవి సమర్పణలో.. ముళ్లగూరు రమేష్ నాయుడుతో కలిసి ఆనంతరాముడు ఈ చిత్రాన్ని నిర్మించారు. సూరజ్, అఖిల్ కార్తిక్, సోనియా, ఫర హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 150 కేంద్రాల్లో ఈనెల 26న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

ఈ సందర్భంగా అనంతపురంలో ఈ చిత్రం ప్రదర్శితమవుతున్న ధియేటర్ లో ప్రేక్షకుల సమక్షంలో చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. స్వచ్చమైన స్నేహానికి నిర్వచనమిస్తూ.. హాస్యానికి పెద్ద పీట వేసి రూపొందించిన టు ఫ్రెండ్స్ (ట్రూ లవ్) ట్రూ సక్సెస్ దిశగా సాగుతుండటం సంతోషంగా ఉందని నిర్మాత ముళ్లగూరు ఆనంతరాముడు రాముడు. తమ సంస్థ నిర్మించే తదుపరి చిత్రాన్ని త్వరలోనే ప్రకటిస్తామని ఆయన అన్నారు.

More News

అదుగో చిత్రానికి రాజేంద్ర‌ప్ర‌సాద్ వాయిస్ ఓవ‌ర్..

అదుగో.. ర‌విబాబు తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రం న‌వంబ‌ర్ 7న విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో ఎన్నో ప్ర‌త్యేక‌త‌లున్నాయి.

తమ్మారెడ్డి భరద్వాజ్ చేతులమీదుగా 'దమయంతి' మూవీ టీజర్ విడుదల

గురు దత్త క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అంగారిక వియాన్ జీ నిర్మిస్తున్న చిత్రం 'దమయంతి'. నౌండ్ల శ్రీనివాస్ దర్శకత్వంలో

విజ‌య్ 'స‌ర్కార్‌' కి క‌ష్టాలు...

విజ‌య్‌, ముర‌గ‌దాస్ సినిమా 'సర్కార్' దీపావ‌ళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 6న విడుద‌ల కానుంది. స‌న్ పిక్చ‌ర్స్ నిర్మించిన ఈ చిత్రం విడుద‌ల‌కు ముందు స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటుంది.

గోపీచంద్ బ‌యోపిక్ కూడా అదే పార్ములాలోనే..

ప్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ కోచ్ పుల్లెల గోపీచంద్ బ‌యోపిక్‌కు రంగం సిద్ధ‌మ‌వుతుంది.

'అనగనగా ఓ ప్రేమకథ' ట్రైలర్ ను విడుదల చేసిన 'గోపీచంద్'

'అనగనగా ఓ ప్రేమకథ ' ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను ఈ రోజు ఉదయం  ప్రముఖ హీరో గోపీచంద్ తన సోషల్ మీడియా 'ట్విట్టర్' ఖాతా ద్వారా విడుదల చేసి చిత్రం యూనిట్ కు అభినందనలు తెలిపారు.