close
Choose your channels

ప్రేక్ష‌కుడు ద‌ర్శ‌క‌త్వం లో ఒకే టికెట్ పై రెండు చిత్రాలు.. 

Saturday, July 20, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్ర‌స్తుతం టికెట్ కొనుక్కుని వ‌చ్చే ప్రేక్ష‌కుడు ఆ సినిమా తీసిన ద‌ర్శ‌కుడు క‌న్నా తెలివిగా ఆలోచిస్తున్నాడు. అతని ఊహ‌కి అంద‌ని విధంగా లేదా అత‌న్ని తృప్తి ప‌రిచేవిధంగా సినిమా వుంటే అది న‌చ్చి మంచి సినిమ అంటున్నారు. అందుకే ప్రేక్ష‌కుడి ఊహ శ‌క్తిని ఉప‌యెగిస్తూ క‌థ‌, క‌థ‌నాలు, మాట‌లు ఈ రెండు చిత్రాల్లో వుంటాయి..

ఈ రెండు క‌థ లు వాటి క‌థ‌నాలు వేరు వేరు గా సాగుతాయి.. చివ‌ర‌కి ఇది ఒకే క‌థ గా క‌న‌ప‌డుతుంది. అప్ప‌టివ‌ర‌కూ ప్రేక్ష‌కుడు ఊహ శ‌క్తి తో ఒక్కో సినిమా కి ఒక్కో క‌థ అనుకుంటాడు. అలాగా రెండు క‌థ‌నాలు , రెండు క‌థలుగా సాగుతాయి. సినిమా క్టైమాక్స్ మాత్రం ఇది ఒకే క‌థ గా తెలుస్తుంది. అంత‌వ‌ర‌కూ ప్రేక్ష‌కుడి ఊహ‌శ‌క్తితో మేము చేస్తున్న మాయాజాల‌మే ఈ ప్ర‌య‌త్నం.

ఒకే క‌థ‌కి రెండు సినిమాలు చేసి డ‌బ్బులు సంపాయించాల‌నే ఆలోచ‌న కాదు.. రెండు సినిమాల‌కి ఒకే టిక్కెట్ వుంటే చాలు. అంటే ఒకే టికెట్ పై రెండు చిత్రాలు అన్న‌మాట‌.. ఈ ప్ర‌య‌త్నం లో చేసే చిత్రానికి ఎక్క‌డా ద‌ర్శ‌కుడు పేరు వుండ‌దు ఎందుకంటే ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు ప్రేక్ష‌కుడు మాత్ర‌మే..అందుకే ఎక్క‌డా ద‌ర్శ‌క‌డు పేరు వుండ‌దు ద‌ర్శ‌క‌త్వం ... ప్రేక్ష‌కుడు

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.