close
Choose your channels

భారత్‌లో అడుగుపెట్టిన ‘‘ఒమిక్రాన్’’.. కర్ణాటకలో రెండు కేసులు గుర్తింపు, కేంద్రం అప్రమత్తం

Thursday, December 2, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అనుకున్నదంతా అయ్యింది ప్రపంచాన్ని కలవరపెడుతోన్న ఒమిక్రాన్ వేరియంట్ భారత్‌లోకి అడుగుపెట్టింది. ఇండియాలో రెండు కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ గురువారం ప్రకటించింది. కర్ణాటకలో రెండు ఒమిక్రాన్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో కొత్తవైరస్‌ నిర్ధారణ అయినట్లు ఆయన చెప్పారు. వైరస్‌ సోకిన ఇద్దరు పురుషుల్లో ఒకరికి 46, మరోకరికి 66 ఏళ్లని లవ్ అగర్వాల్ తెలిపారు. వైరస్‌ సోకిన ఇద్దరిని ప్రత్యేకంగా ఐసోలేషన్‌లో తరలించామని.. ఒమిక్రాన్‌ సోకినవారి ప్రైమరీ కాంటాక్ట్స్‌ ట్రేస్‌ చేస్తున్నామని చెప్పారు. అయితే, వీరిద్దరిలో తీవ్రమైన లక్షణాలు లేవని లవ్ అగర్వాల్ వెల్లడించారు.

కేరళ, మహారాష్ట్రలలో 10,000 కంటే ఎక్కువ కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని..  దేశంలోని 55 శాతం కేసులు ఈ రెండు రాష్ట్రాల్లో నమోదయ్యాయని చెప్పారు. వారంవారీ కోవిడ్-19 పాజిటివిటీ రేటు 15 జిల్లాల్లో 10 శాతం కంటే ఎక్కువ.. 18 జిల్లాల్లో 5 నుంచి 10 శాతం మధ్య ఉందన్నారు.  గతి తెలిసిందే.

కాగా.. ఈ ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే 29 దేశాలకు విస్తరించిందని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. నాటి నుంచి నేటివరకు 373 ఒమిక్రాన్‌ కేసులు నమోదైనట్లు పేర్కొంది.  దక్షిణాఫ్రికాలో అత్యధికంగా 183 ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూడగా.. బోట్స్‌వానాలో 19, నెదర్లాండ్స్‌ 16, హాంగ్‌కాంగ్‌ 7, ఇజ్రాయిల్‌ 2, బెల్జియం 2, యూకే 32, జర్మనీ 10, ఆస్ట్రేలియా 8, ఇటలీ 4, డెన్మార్క్‌ 6, ఆస్ట్రియా 4, కెనడా 7, స్వీడెన్‌ 4, స్విట్జర్లాండ్‌ 3, స్పెయిన్‌ 2, పోర్చుగల్‌ 13, జపాన్‌ 2, ఫ్రాన్స్‌ 1, ఘనా 33, దక్షిణ కొరియా 3, నైజీరియా 3, బ్రెజిల్‌ 2, నార్వే 2, అమెరికా, సౌదీ అరేబియా, ఐర్లాండ్‌ యూఏఈలలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.
 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.