close
Choose your channels

క్రీడల నేపథ్యంలో ఉదయ్ శంకర్,ఐశ్వర్య రాజేష్ జంటగా 'అధిరో క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి' తొలి చిత్రం ప్రారంభం

Monday, January 21, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

క్రీడల నేపథ్యంలో ఉదయ్ శంకర్,ఐశ్వర్య రాజేష్ జంటగా అధిరో క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి తొలి చిత్రం ప్రారంభం

నూతన చలన చిత్ర నిర్మాణ సంస్థ 'అధిరో క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి' తమ తొలి చిత్రాన్ని నేడు ప్రారంభించింది. ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేమ్) కథానాయకునిగా, ఐశ్వర్య రాజేష్ (కాకా ముత్తై, కన్నా తమిళ చిత్రాల నాయిక, దివంగత ప్రముఖ నటుడు రాజేష్ కుమార్తె) నాయికగా నటిస్తున్నారు. తమిళనాట హీరో విజయ్ ఆంటోని నటించగా 'సలీం' వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకిది తొలి తెలుగు చిత్రం. ఈ చిత్రం నేడు హైదరాబాద్ లోని రామానాయుడు స్థూడియో లో ఉదయం 10 గంటలకు ప్రారంభమయింది.

రామా నాయుడు స్థూడియోలో వైభవంగా ప్రారంభమైన ఈ చిత్రం వేడుకకు ప్రముఖ నిర్మాత శ్రీ అల్లు అరవింద్, జెమిని కిరణ్,శరత్ మరార్, ప్రముఖ దర్శకులు చంద్ర సిద్దార్ధ, కరుణాకరన్, కిషోర్ పార్ధసాని (డాలి), జొన్నలగడ్డ శ్రీనివాసరావు, శ్రీరామ్ బాలాజీ, సంగీత దర్శకుడు కోటి, ప్రొఫెసర్ జి. శ్రీరాములు తదితరులు విచ్చేసి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.

ఎన్నో ఘనవిజయం సాధించిన చిత్రాలకు కధలందించిన ప్రముఖ రచయిత భూపతిరాజా ఈ చిత్రానికి కథ నందించారు. గిఫ్టన్ ఇలియాస్ ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకునిగా పరిచయం అవుతున్నారు. క్రీడల నేపథ్యంలో సాగే వినోదభరితమైన కుటుంబ కధా చిత్రమిదని దర్శకుడు ఎన్ వి.నిర్మల్ కుమార్ తెలిపారు.

నేడు ప్రారంభమైన ఈ చిత్రం ఈ నెల మరియు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో జరిగే వివిధ షెడ్యూల్స్ లో చిత్రం షూటింగ్ పూర్తవుతుంది అని చిత్ర నిర్మాతలు జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ లు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రదేశాలలోను, విదేశాలలోను ఈ చిత్రం కథానుసారం షూటింగ్ ను జరుపుకుంటుంది అని తెలిపారు నిర్మాతలు. చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో సంజయ్ స్వరూప్, ప్రదీప్ రావత్, రూపాలక్ష్మి తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: గిఫ్టన్ ఇలియాస్, మాటలు: రాజేంద్రకుమార్, మధు; ఛాయా గ్రహణం: గణేష్ చంద్ర; పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ; కళా దర్శకుడు: మణి వాసగం.
 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.