కరోనా వార్‌లోనూ ఉద్ధవ్ థాక్రే వర్సెస్ రాజ్‌థాకరే!

కరోనా మహమ్మారి విస్తరిస్తుండటం.. మరీ ముఖ్యంగా మహారాష్ట్రలో రోజురోజుకూ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో ఈ తరుణంలో కలిసికట్టుగా పనిచేయాల్సిన బ్రదర్స్.. సీఎం ఉద్దవ్ థాక్రే.. మహారాష్ట్ర నవనిర్మాణ అధినేత రాజ్‌థాకరే ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇందుకు శివసేన శివసేన అధికారిక పత్రిక సామ్నా పత్రిక వేదికైంది.

అసలేం జరిగింది..!

వైన్ షాపులు తిరిగి ప్రారంభించాలని ఆయన చేసిన డిమాండ్‌ను ఎత్తి చూపుతూ ‘ఆయనకు తినే కంచం లాగే మద్యం గ్లాసు నిత్యవసరం కాబోలు’ అంటూ విమర్శించింది.

‘రాష్ట్రంలో మద్యం షాపులు తెరవడానికి మళ్లీ అనుమతివ్వండి. ప్రజలకు మద్యం చేరువ చేయడానికి నేను చెప్పడం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు పడిపోయాయి. ప్రభుత్వానికి ఆదాయం పెరగాలనే కారణంతోనే నేను ఈ డిమాండ్ చేస్తున్నాను’ అని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు రాసిన లేఖలో రాజ్‌థాకరే ప్రస్తావించారు.

సామ్నా వర్సెన్ ఇదీ..

అయితే దీనిపై సామ్నా ‘‘మీరు (రాజ్‌థాకరే) మద్యం దుకాణాలు తెరవాలని అంటున్నారు. నిజానికి ఇప్పుడు మద్యం తయారీ కంపెనీలు కూడా మూతపడ్డాయి. మరి ఇలాంటప్పుడు మద్యం అమ్మకం షాపులు తెరిచి ప్రయోజనం ఏముంటుంది? మద్యం షాపులు తెరవాలంటే తయారీ కంపెనీలు తెరుచుకోవాలి. కార్మికులు పని చేయాలి. వాళ్లకు ముడి సరుకు దొరకాలి. ఈ విషయం పట్టించుకోకుండా మద్యం షాపులు తెరవాలని పేర్కొంది. ఆయన డిమాండ్ చాలా గమ్మత్తుగా ఉంది. ఆహారంతో పాటు మద్యం కూడా నిత్యవసర సరుకే అని ఆయన ప్రభుత్వానికి తెలియజేస్తున్నట్లు ఉన్నారు. ఆయనకు అన్నం కంచం లాగే మందు గ్లాసు కూడా నిత్యవసర సరుకులాగే అనిపిస్తుందేమో’ అని సామ్నా విమర్శించింది.

More News

భారత్‌లో 23వేలు దాటిన కేసులు.. 24 గంటల్లో కొత్తగా..

భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23వేలు దాటిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. శుక్రవారం నాడు కేసులకు సంబంధించి ఎంసీడీసీ డైరెక్టర్ సుజిత్ కుమార్ సింగ్ మీడియా

మ‌హేశ్ హెడ్ మ‌సాజ్‌.. చేసిందెవ‌రంటే?

క‌రోనా ఎఫెక్ట్ వ‌ల్ల నెల‌కున్న లాక్‌డౌన్ కార‌ణంగా సినీ సెల‌బ్రిటీలంద‌రూ ఇంటి ప‌ట్టునే ఉంటున్నారు. అంద‌రూ కుటుంబ స‌భ్యుల‌తో వారి విలువైన స‌మ‌యాన్ని గడుపుతున్నారు.

బాల‌య్య 107 ముహూర్తం కుదిరిందా?

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో త‌న 106వ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా పూర్తి కాక మునుపే ఆయ‌న త‌న

అభిమానుల‌కు షాకిచ్చిన రౌడీ హీరో!

ప్రస్తుతం ఇంట్లో తనను మగాడిలా చూడటం లేదని వాపోతున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతం టాలీవుడ్‌లో బీ ద రియ‌ల్ మేన్ అనే ఛాలెంజ్ మాంచి ట్రెండ్‌లో ఉంది.

రాజ‌మౌళిపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన ద‌ర్శ‌కుడు

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి.. ప్ర‌త్యేక ప‌రిచ‌యం అక్క‌ర్లేదు పేరిది. ఈ స్టార్ డైరెక్ట‌ర్ ప్ర‌స్తుతం తార‌క్‌, చ‌ర‌ణ్‌ల‌తో రౌద్రం ర‌ణం రుధిరం సినిమాను రూపొందిస్తోన్న సంగ‌తి తెలిసిందే.