close
Choose your channels

Ukku Satyagraham : 'ఉక్కు సత్యాగ్రహం' ఆడియో విడుదల

Friday, November 25, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తాను ఏ తరహా సినిమా తీసినా అందులో సామాజిక అంశాలను మిళితం చేసే సత్యారెడ్డి ఇప్పటివరకు ప్రత్యూష, సర్దార్ చిన్నపరెడ్డి ,రంగుల కళ ,కుర్రకారు ,అయ్యప్ప దీక్ష , గ్లామర్, సిద్ధం, ప్రశ్నిస్తా వంటి చిత్రాలను నిర్మించారు. దర్శక, నిర్మాతగానే కాకుండా నటుడిగా కూడా తన అభిరుచిని చాటుకుంటున్న విషయం తెలిసిందే.

జనం సమస్యల పరిష్కారం కోసం రగులుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రధాన అంశంగా చేసుకుని తాజాగా “ఉక్కు సత్యాగ్రహం” పేరుతో సత్యారెడ్డి ఓ సినిమా తీస్తున్నారు. తాను ప్రధాన పాత్ర పోషిస్తూ, స్వీయ నిర్మాణ దర్శకత్వంలో జనం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సత్యారెడ్డి రూపొందిస్తున్నారు.

ఇదివరకే ఈ చిత్రం కోసం యుద్ధ నౌక గద్దర్ రచించి, పాడిన ‘సమ్మె నీ జన్మహక్కురన్నో…’ అంటూ సాగే లిరికల్ వీడియో పాటను మే డే సందర్భంగా గద్దర్ తన చేతుల మీదుగానే విడుదల చేసారు. ఈ పాటను ప్రధాన పాత్రధారి సత్యా రెడ్డి, ఇతర ఆర్టిస్టులతో పాటు గద్దర్ పై చిత్రీకరించారు.

తాజాగా ఇప్పుడు సుద్దాల అశోక్ తేజ రచించిన పాటను మరోపాటను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ ఈవెంట్ లో గద్దర్, సత్యారెడ్డి, నిర్మాత బెక్కం వేణుగోపాల్, దర్శకుడు త్రినాధ్ రావ్ నక్కిన, దర్శకులు ఆర్. నారాయణమూర్తి తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ... గద్దర్ రాసిన పాటలు ఒకటా రెండా ఎన్నో సినిమాలకు అద్భుతమైన పాటలను అందించారు. సినిమా గురించి మాట్లాడుతూ విశాఖ ఉక్కు - ఆంధ్రులు హక్కు అని నినాదాలు చేస్తుంటే దానిని ఈరోజు ప్రయివేటీకరణ చేయడం న్యాయమా.? కాదు అని ప్రశ్నిస్తూ సినిమా తీసాడు సత్యారెడ్డి గారు.కళాకారుడు ప్రశ్నించాలి. అలా ప్రశ్నిస్తున్నాడు సత్యారెడ్డి అంటూ ఆడియో విడుదలకు హాజరైన వారికీ కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయ పార్టీలు ను ఉద్దేశిస్తూ ప్రయివేటీకరణ ఆపమంటూ విజ్ఞప్తి చేసారు.

గద్దర్ మాట్లాడుతూ... అనేక సామజిక అంశాలు మాట్లాడుతూ, ఆర్ నారాయణమూర్తి తో ఉన్న అలనాటి జ్ఞాపకాలను పంచుకుంటూ వంగపండు నుస్మరించుకున్నారు. సినిమా గురించి మాట్లాడుతూ ఈ సమస్య కేవలం విశాఖపట్నం ప్రజలు మాత్రమే కాదు. మన తెలుగు ప్రజలందరిది. మొత్తం తెలుగు ప్రజలందరూ ఏకమవ్వాలని పిలిపునిస్తున్నాను. అందరు కలిసి ఈ ప్రయివేటీకరణ ఆపగలరు అని నమ్ముతూ ముగిస్తున్నాను.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.