Kavitha:లిక్కర్ కేసులో ఊహించని పరిణామం.. కవిత బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు..

  • IndiaGlitz, [Saturday,March 23 2024]

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో వరుసగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసి ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈరోజుతో ఆమె కస్టడీ పూర్తికావొస్తున్న తరుణంలో ఈడీ ఊహించని షాక్ ఇచ్చింది. తెల్లవారుజాము నుంచే హైదరాబాద్‌లోని కవిత బంధువుల ఇళ్లతో పాటు ఆమె భర్త అనిల్ కుమార్ బంధువుల ఇళ్లలోనూ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. మాదాపూర్‌లో ఉన్న కవిత ఆడపడుచు అఖిల ఇంట్లోనూ తనిఖీలు చేస్తున్నారు.

కస్టడీలో కవిత ఇచ్చిన సమాచారంతోనే అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో కవిత భర్త అనిల్ కుమార్ బ్యాంకు లావాదేవీలను పరిశీలించగా ఆడపడుచు అఖిల విషయం బయటికొచ్చిందని అందుకే సోదాలు అని వినిపిస్తోంది. తనిఖీల్లో ఏం దొరికాయి..? ఏమైనా కొత్త అరెస్టులు ఉంటాయా..? అనే విషయాలు తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాలి.

కాగా మార్చి 15న హైదరాబాద్‌లోని కవిత ఇంట్లో ముమ్ముర సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేశారు. కవిత నుంచి ఇప్పటికే సుమారు 16 మొబైల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమె భర్త అనిల్ కుమార్‌ను విచారణకు రావాలని కూడా నోటీసులిచ్చారు. అయితే ఆయన విచారణకు హారుకాలేదు.

ఇదిలా ఉంటే నేటితో కవిత కస్టడీ ముగియడంతో రౌస్ అవెన్యూ కోర్టులో ఆమెను అధికారులు హాజరుర్చనున్నారు. మరో ఐదు రోజుల పాటు కస్టడీని పొడిగించాలని ఈడీ కోరనున్నట్లు తెలుస్తోంది. అయితే కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుంది అనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఆరు రోజుల పాటు కస్టడీకి ఇచ్చిన విషయం విధితమే. ఇప్పుడు కవిత కస్టడీ కూడా పొడిగిస్తే ఇద్దరిని కలిపి విచారించే అవకాశముంది.

More News

Pawan Kalyan: పిఠాపురం నుంచే పవన్ కల్యాణ్‌ ఎన్నికల ప్రచారం షూరూ

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే రాష్ట్ర స్థాయి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. మంగళిగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన నేతలతో

KCR: అప్పుడు తెలంగాణ కోసం పోరాటం.. ఇప్పుడు ఉనికి కోసం ఆరాటం.. ఎందుకిలా..?

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గతంలో ఎన్నడూ ఎదుర్కోని సందిగ్థత పరిస్థితిని ప్రస్తుతం ఎదుర్కొంటున్నారు. 2001లో టీఆర్ఎస్ స్థాపించిన నాటి నుంచి కేసీఆర్ తన రాజకీయ వ్యూహాలతో పార్టీని బతోపేతం చేశారు.

Devara: 'దేవర' షూటింగ్ వీడియో లీక్.. ఎన్టీఆర్ లుక్ అదిరిపోయిందిగా..

ప్రస్తుత డిజిటల్ కాలంలో లీకులు ఎక్కువైపోతున్నాయి. ఎక్కడ మూవీ షూటింగ్ జరిగినా ప్రజలు తమ ఫోన్లలో చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఈ లీకులు తెలుగు ఇండస్ట్రీని ఇబ్బందికి గురిచేస్తున్నాయి.

Vijayawada MP: బెజవాడ గడ్డపై అన్నదమ్ముల సవాల్.. విజయం ఎవరికి దక్కుతుందో..?

ఏపీలో రాజకీయ వాతావరణం తారా స్థాయికి చేరుకుంది. ప్రత్యర్థులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే రాష్ట్రంలోని ఓ పార్లమెంట్ నియోజకవర్గం

BRS:బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులుగా మాజీ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే మరో ఇద్దరు అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించింది. నాగర్ కర్నూలు ఎంపీ స్థానానికి మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్,