close
Choose your channels

ప్రభాస్ 'రాధే శ్యామ్' లో ఊహకు అందని కోణం..

Friday, June 18, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రభాస్ రాధే శ్యామ్ లో ఊహకు అందని కోణం..

బాహుబలి తర్వాత దేశవ్యాప్తంగా ప్రభాస్ నటించే చిత్రాలకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. సాహో ఆ అంచనాలు అందుకోలేక నిరాశపరిచింది. దీనితో ఇప్పుడు ప్రభాస్ అభిమానులు ఆకలితో ఉన్నారు. ప్రస్తుతం అందరి కళ్ళు ప్రభాస్, పూజా హెగ్డే నటిస్తున్న రాధే శ్యామ్ పైనే ఉన్నాయి.

ఇదీ చదవండి: సడెన్ డెసిషన్.. హెల్త్ చెకప్ కోసం యుఎస్ కి రజని

ఈ చిత్రం పీరియాడిక్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ ప్రేమ కథ అని అందరికి తెలుసు. కానీ చిత్ర యూనిట్ మాత్రం కథలో ఓ సర్ ప్రైజింగ్ ప్యాకేజ్ దాచి ఉంచారట. ప్రేక్షకుల ఊహకు కూడా అందని విధంగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉండబోతున్నట్లు టాక్.

లేటెస్ట్ గా వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం రాధే శ్యామ్ చిత్రంలో హర్రర్ ఎలిమెంట్స్ ఉన్నట్లు టాక్. ఆ సన్నివేశాల్లో విజువల్ ఎఫెక్ట్స్, బ్యాగ్రౌండ్ సంగీతం మతి పోగొట్టే విధంగా ఉంటాయట. ప్రేక్షకులు సరికొత్త అనుభూతికి లోనయ్యేలా దర్శకుడు రాధా కృష్ణ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది.

ప్రభాస్ కు హోమ్ బ్యానర్ లాంటి యువి క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.