దేశాన్ని ఊపేస్తోన్న పుష్ప ఫీవర్.. రాజ్‌నాథ్ నోట ‘‘తగ్గేదే లే’’ డైలాగ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘‘పుష్ప’’. గతేడాది డిసెంబర్‌లో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు. ముఖ్యంగా పుష్పలోని పాటలు, యాక్షన్ సీక్వెన్స్‌లు, డైలాగులు జనంలోకి బాగా వెళ్లాయి. ప్రధానంగా ‘‘తగ్గేదే లే’’ అన్న డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది. సినీ తారలు, క్రికెటర్లు, తదితర ప్రముఖులు పుష్ప డైలాగ్‌లు, పాటలతో వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. మొన్నామథ్య బెంగళూరులోని ఓ ఎర్రచందనం స్మగ్లర్ ‘పుష్ప’ సినిమా చూసి స్ఫూర్తి పొందాడు. ఆ సినిమా స్టైల్‌లోనే ఎర్రచందనం స్మగ్లింగ్‌కు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడు.

తాజాగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత రాజ్‌నాథ్ సింగ్ కూడా ‘తగ్గేదేలే’ అంటున్నారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గంగోలిహట్‌ నియోజకవర్గంలో జరిగిన సభలో రాజ్‌నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ప్రస్తుతం ఒక సినిమా గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. ఆ సినిమా పేరు పుష్ప. ఇక్కడ (ఉత్తరాఖండ్) కూడా ఒక పుష్కర్ (సీఎం పుష్కర్ థామి) ఉన్నారు. ఆయన చాలా సింపుల్‌గా, సౌమ్యంగా ఉంటారు. అయితే పుష్కర్‌లో పువ్వూ (ఫ్లవర్) ఉంది, నిప్పూ (ఫైర్) ఉంది. ఆయనను ఎవరూ ఆపలేరు, ఆయన తగ్గేదే లేదు'' అంటూ రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే.. యూపీ ఎన్నికల కోసం కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ కూడా పుష్ప సినిమాను వాడుకుంది. శ్రీవల్లి పాటలోని ట్యూన్‌ను తీసుకుని యూపీ గొప్పతనాన్ని చెబుతూ ఓ పాటను రూపొందించింది విడుదల చేసింది. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది.

More News

డ్రగ్స్‌పై ఉక్కుపాదం.. తెలంగాణలో రెండు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు, వివరాలివే

తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మాదక ద్రవ్యాలపై కీలక సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి కేసీఆర్.

కొత్త ఇంట్లో ఆమెతో కలిసి అడుగుపెట్టిన షణ్ముఖ్.. ఫోటోలు వైరల్

యూట్యూబ్, టిక్‌టాక్‌ల ద్వారా యువతలో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న షణ్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

టికెట్ ధరల వివాద: ఎల్లుండి జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ.. చిరంజీవి వెంట ఎవరెవరు..?

రాష్ట్రంలో నెలకొన్న సినిమా టికెట్ల వివాదానికి ఏపీ ప్రభుత్వం చెక్ పెట్టాలనే ఆలోచనలో వుంది.

థర్డ్ వేవ్ ముగిసింది.. ఏ ఆంక్షలు లేవు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఎత్తేయొచ్చు: తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ ముగిసిపోయినట్లేనని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు.

రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ జంటగా అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్న 'శశివదనే' ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ జంటగా గౌరీ నాయుడు సమర్పణలో ఎస్వీఎస్ కన్‌స్ట్రక్షన్స్ ప్రై.లి. భాగస్వామ్యంతో ఏజీ ఫిల్మ్ కంపెనీ పతాకంపై అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్న చిత్రం 'శశివదనే'.