Unstoppable:అన్‌స్టాపబుల్ కొత్త ఎపిసోడ్ ప్రొమో వచ్చేసింది.. గెస్ట్‌లు ఎవరంటే..?

  • IndiaGlitz, [Friday,December 15 2023]

నటసింహం నందమూరి బాలకృష్ణలో సరికొత్త యాంగిల్ చూపించిన అన్‌స్టాపబుల్ విత్ NBK టాక్ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓటీటీలో ఏ టాక్‌ షోకు రాని రికార్డులు ఈ షోకు వచ్చాయి. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో మూడవ సీజన్‌ ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సీజన్ తొలి ఎపిసోడ్‌లో ‘యానిమల్’ మూవీ టీమ్ సందడి చేసింది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, హీరోయిన రష్మిక మందన్నా, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పాల్గొని బాలయ్యతో రచ్చ చేశారు.

ప్రస్తుతం మరో ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేసింది ఆహా సంస్థ. ఇందులో అతిథులుగా సీనియర్ నటి సుహాసిని, హీరోయిన్ శ్రియ, దర్శకులుజయంత్ సి పరాన్జీ, హరీష్ శంకర్ పాల్గొన్నారు. ఇక ఈ ప్రొమోలో బాల‌కృష్ణ ‘సుహాసినీ.. మనది జన్మజన్మల బంధం.. నాది శ్రియాది ఈ మిలీనియం బంధం’ అని అంటారు. సుహాసినీ ‘అప్పుడు బాలా చాలా షై’ అనగానే హరీష్ శంకర్ నేను నమ్మట్లేదు అన్నారు వెంటనే బాలయ్య ‘కావాలనే మీ ముగ్గురితో మాట్లాడుతున్నాను హరీష్‌ని అవాయిడ్ చేస్తున్నాను’ అని చెబుతారు. ‘ఏం..బాబు’ అని జయంత్ అడగ్గానే..’మాకు మాకు పాత కక్షలు ఉన్నాయయ్యా’ అంటారు.

ఇక సుహాసినీ, జయంత్, హరీష్ శంకర్ కూడా బాల‌కృష్ణని పలు ప్రశ్నలు అడిగారు. మీ ఎపిసోడ్‌లలో ఎవరూ తక్కువగా మాట్లాడారని సుహాసిని అడగ్గా.. ఒకతను అలాగే చెప్పారని బాలయ్య చెప్పగా.. ఎవరు సార్ అని హరీష్ అడగ్గా.. మీ వాడే అని చెబుతారు. ఇలా బాలయ్య పంచులు, డ్యాన్లతో ప్రొమో ప్రేక్షకుల్లో ఆసక్తి రేపింది. ఈ కొత్త ఎపిసోడ్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

ఇక బాలయ్య సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ మొదలైంది. ఇందులో బాలయ్య డిఫరెంట్‌ లుక్‌లో కనిపించనున్నారని తెలుస్తోంది. 1980 బ్యాక్‌డ్రాప్‌ నేపథ్యంలో మూవీ తెరకెక్కుతుందని సమాచారం. వచ్చే ఏడాది వేసవి కానుకగా సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.

More News

KCR:ఆసుపత్రి నుంచి మాజీ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ య‌శోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఆసుపత్రి నుంచి నేరుగా బంజారాహిల్స్ నందిన‌గ‌ర్‌లోని

Bigg Boss Telugu 7 : పాత టాస్క్‌లతో కొత్త గేమ్స్ ఆడించిన బిగ్‌బాస్.. ఒకరి కోసం ఒకరు కష్టపడ్డ కంటెస్టెంట్స్

బిగ్‌బాస్ 7 తెలుగు ఈ వారంతో ముగియనున్న సంగతి తెలిసిందే. గత వారం శోభాశెట్టి ఎలిమినేట్ కాగా..

KCR:మాజీ సీఎం కేసీఆర్‌కు భద్రత కుదింపు.. గులాబీ శ్రేణులు ఆగ్రహం..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో పాలన సాగిస్తున్నారు. ఇప్పటికే పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీలు చేసిన ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

KCR:కాసేపట్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న కేసీఆర్

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం క్రమంగా కోలుకుంటోంది. వారం రోజులుగా సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో

Bunny Vasu:రాజకీయాల్లోకి నిర్మాత బన్నీ వాసు.. జనసేన ప్రచారం విభాగం ఛైర్మన్‌గా నియామకం..

ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్ని పార్టీలు ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి.