close
Choose your channels

Balakrishna: ఆ హీరో అంటే క్రష్ అన్న స్టార్ హీరోయిన్... జయసుధ, జయప్రద, రాశీఖన్నాలతో బాలయ్య ట్రిపుల్ ధమాకా

Thursday, December 22, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నందమూరి బాలకృష్ణ (Balakrishna) హోస్ట్‌గా ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో ప్రసారమవుతున్న ‘అన్‌స్టాపబుల్ 2’’ షో విజయవంతంగా దూసుకెళ్తోంది. వారానికి ఒక గెస్ట్‌తో బాలయ్య ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పటికే 5 ఎపిసోడ్స్‌ స్ట్రీమింగ్ అవుతుండగా తాజాగా ఆరో ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను ఆహా టీమ్ విడుదల చేసింది. ఈ ఎపిసోడ్‌లో అలనాటి స్టార్ హీరోయిన్లు జయప్రద, జయసుధలు (Jayasudha Jaya Prada) సందడి చేశారు. మధ్యలో యంగ్ బ్యూటీ రాశీ ఖన్నా (Rashi Khanna)కూడా ఎంట్రీ ఇచ్చింది.

1970, 80లలో సౌత్‌ని ఊపేసిన జయప్రద- జయసుధ:

1970, 80 దశకాలలో జయసుధ, జయప్రదలు (Jayasudha Jaya Prada) దక్షిణాదిని ఒక ఊపు ఊపారు. నటనకు ప్రాధాన్యం వున్న పాత్రలతో జయసుధ.. అందమైన అభినయంతో జయప్రదలు సత్తా చాటారు. అగ్ర నటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజుల సరసన వీరు నటించి అగ్ర కథానాయికలుగా వెలుగొందారు. అలాంటి వీరిద్దరిని చాలా ఏళ్ల తర్వాత ఒకే వేదికపైకి తీసుకొచ్చింది ఆహా టీమ్.

రౌడీ స్టార్‌పై మనసు పడ్డ రాశీ ఖన్నా (Rashi Khanna) :

ఈ ఎపిసోడ్ ప్రోమో విషయానికి వస్తే.. తన షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి మరీ జయసుధను పెళ్లి కూతురు చేయడానికి వెళ్లానని జయప్రద చెప్పగా.. కాంపిటీషన్‌కు కట్ చేయడానికేగా అంటూ బాలయ్య పంచ్ డైలాగ్ పేల్చారు. తర్వాత వీరి మధ్యలోకి రాశీ ఖన్నా రాగా.. ఆమెను ఇరుకున పెట్టేలాగా ఇప్పటి వరకు నటించిన హీరోలలో ఎవరితో క్రష్ వుందని బాలయ్య ప్రశ్నించారు. దీనికి ఆమె ఏ మాత్రం తడబడకుండా విజయ్ దేవరకొండ అని ఆన్సర్ ఇచ్చింది. మరి ఈ ముగ్గురితో కలిసి నందమూరి అందగాడు చేసిన సందడి చూడాలంటే డిసెంబర్ 23 వరకు ఆగాల్సిందే.

ప్రభాస్ - గోపీచంద్ ( Prabhas, Gopichand)ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్ :

ఇదిలావుండగా... పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, గోపీచంద్‌ల ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో ఇప్పటికే రికార్డులను బద్ధలు కొడుతోంది. ముఖ్యంగా డార్లింగ్ ఫ్యాన్స్ ఎప్పుడా ఎప్పుడా అని ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 30న ఈ ఎసిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. వీరి తర్వాత పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్, క్రిష్‌ల కాంబినేషన్‌లో ఓ ఎపిసోడ్ వుండే అవకాశం కనిపిస్తోంది. బాలయ్య, పవన్‌లను ఒకే వేదికపై చూసేందుకు మెగా, నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్నారు. మొత్తం అన్‌స్టాపబుల్ 2 ఓ రేంజ్‌లో దుమ్మురేపుతోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.