సేవా కార్యక్రమాలతో ప్రశంసలు పొందుతున్న ఉపాసన కొణిదెల

అపోలో ఫౌండేషన్ వైస్ ఛైర్మన్, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల తన సేవా కార్యక్రమాలతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. సాటి వారికి వీలైనంత చేయూత అందించాలనే స్పూర్తిని కలిగిస్తున్నారు. అపోలో ఫౌండేషన్ ద్వారా కరోనా సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ఆమె, మారుమూల గ్రామాలకు సైతం వైద్య సేవలు అందేలా కృషి చేశారు. పర్యావరణం, వైల్డ్ లైఫ్ వంటి విషయాల్లోనూ ఉపాసన ఛారిటీలు చేస్తుంటారు.

ఆమె దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న వృద్ధాశ్రమాలకు అండగా నిలబడేందుకు ముందుకొచ్చారు. అక్కడ ఉంటున్న వృద్ధులకు మందులు, ఆహార పదార్థాలు, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అపోలో ఫౌండేషన్ లో భాగమైన బిలియన్ హార్ట్స్ బీటింగ్ కార్యక్రమం ద్వారా ఆమె ఢిల్లీ, తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో 150
వృద్ధాశ్రమాలకు చేయూత అందిస్తున్నారు. తాజాగా వృద్ధాశ్రమంలో ఆమె సీనియర్ సిటిజన్స్ తో కలిసి కాసేపు సరదాగా గడిపారు. వాళ్లతో ముచ్చటిస్తూ ఆనందాన్ని పంచారు. ఉపాసన తమ దగ్గరకు వచ్చి మాట్లాడటంతో ఆ వృద్ధులంతా సంతోషాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలకు అభిమానులతో సహా నెటిజన్స్ హ్యాట్సాఫ్ అంటున్నారు.

More News

‘యు ఫ** గయ్స్ కాల్డ్ మీ’ : లైవ్‌లో హీరో విశ్వ‌క్ సేన్ చిందులు.. బయటకు పొమ్మన్న యాంకర్

సినిమా రిలీజ్ కావడానికి ముందు దానిని ప్రమోట్ చేసుకోవడమన్నది ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌ల కాలం నుంచి వస్తున్నదే.

తెలుగు మహాసభలకు రండి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ‘‘ఆటా’’ ఆహ్వానం

అమెరికా తెలుగు సంఘం ‘ఆటా’ 17వ మహాసభలు అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో జూలై 1 నుంచి 3 వరకు జరగనున్నాయి.

సైనికులు, రైతుల స్థాయి కార్మికులది .. పవన్ కల్యాణ్ ‘‘మే డే’’ శుభాకాంక్షలు

మే డేను పురస్కరించుకుని కార్మిక ప్రపంచానికి శుభాకాంక్షలు తెలిపారు జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్.

మద్యం మత్తులో టవరెక్కి.. అర్ధరాత్రిపూట పోలీసులకు చెమటలు పట్టించిన మందుబాబు

అమ్మానాన్న మందలించారనో , ప్రేమలో విఫలమయ్యారనో, భార్యాభర్తల మధ్య గొడవలనో.. ఇలా ఈ మధ్యకాలంలో చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యలు ఎక్కువవుతున్నాయి.

ఆటా మహాసభలకు ఎర్రబెల్లికి ఆహ్వానం.. తప్పక వస్తానన్న మంత్రి

అమెరికా తెలుగు సంఘం ‘ఆటా’ 17వ మహాసభలు జూలై 1 నుంచి జూలై 3 తేదీ వరకు అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో జరగనున్నాయి.