త‌మ‌న్నాకు షాకిచ్చిన ఉపాస‌న‌

  • IndiaGlitz, [Friday,October 04 2019]

మిల్కీబ్యూటీ త‌మ‌న్నాకు రామ్‌చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న కొణిదెల షాకిచ్చింది. ఇంత‌కు ఉపాసన ఎందుకు మిల్కీ బ్యూటీకి షాకిచ్చిందనే వివ‌రాల్లోకెళ్లే.. అక్టోబ‌ర్ 2న విడుద‌లైన చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డిలో ల‌క్ష్మి అనే ప్ర‌జా గాయ‌ని పాత్ర‌లో త‌మ‌న్నా న‌టించింది. ఈ పాత్ర‌కు చాలా పేరు వ‌చ్చింది. త‌మ‌న్నా కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్ట‌ర్ అని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో చిత్ర నిర్మాత రామ్‌చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న, త‌మ‌న్నాకు ఖ‌రీదైన ఉంగ‌రాన్ని గిఫ్ట్‌గా ఇచ్చి షాకిచ్చింది. 'నిర్మాత భార్య నుండి తమ‌న్నాకు సూప‌ర్ బ‌హుమ‌తి. నిన్ను మిస్ అవుతున్నాను.. త్వ‌ర‌లోనే క‌లుద్దాం' అని ఉపాస‌న పోస్ట్ చేశారు.

సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రంలో ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి భార్య సిద్ద‌మ్మ పాత్ర‌లో న‌య‌న‌తార న‌టించింది. ప్రేయ‌సి ల‌క్ష్మి పాత్ర‌లో త‌మ‌న్నా న‌టించింది. న‌ర‌సింహారెడ్డి కోసం ఆత్మాహుతి దాడి చేసే ల‌క్ష్మి పాత్ర‌లో త‌మ‌న్నా సూప‌ర్బ్‌గా న‌టించింద‌ని, న‌య‌న‌తార కంటే త‌మ‌న్నా పాత్ర‌కు చాలా ప్రాధాన్య‌త ఉంద‌ని సినిమా చూసిన వారంటున్నారు.

అక్టోబ‌ర్ 2న తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీలో విడుద‌లైన ఈ సినిమాకు హిట్ టాక్‌ను సంపాదించుకుంది. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శక‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. త్వ‌ర‌లోనే చిరంజీవి కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో త‌న త‌దుప‌రి సినిమాకు సిద్ధ‌మ‌వుతున్నారు.

More News

ర‌జ‌నీ `ద‌ర్బార్` షూటింగ్ పూర్తి

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా  స్టార్ డైరెక్ట‌ర్ ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో లైకా ప్రొడ‌క్ష‌న్స్ చిత్రం నిర్మించిన చిత్రం `ద‌ర్బార్‌`.

సైరా యూనిట్‌కి అల్లు వారి పార్టీ

మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టించిన `సైరా న‌ర‌సింహారెడ్డి`

'లైఫ్ స్టైల్ ' ఫస్ట్ లుక్ లాంచ్

కలకొండ ఫిలింస్ లైఫ్ స్టైల్ చిత్ర ఫస్ట్ లుక్ కార్యక్రమం ఘనంగా జరిగింది. డాక్టర్ వకుళాభరణం మోహనకృష్ణ రావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసారు.

ఇస్మార్ట్‌పై బాలీవుడ్ క‌న్ను

ఈ ఏడాది ఇప్ప‌టి వ‌ర‌కు హ్యూజ్ హిట్ సాధించిన చిత్రాల్లో `ఇస్మార్ట్ శంక‌ర్` ఒక‌టి. ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్‌,

'మామాంగం' నవంబర్ 21న రిలీజ్‌

భారత దేశం  సంస్కృతి, సంప్రదాయాలకు పెట్టింది పేరు. మన చారిత్రిక కథలు, పురాణ గాధలు ప్రపంచం మొత్తాన్ని అబ్బుర పరుస్తూ ఉంటాయి.