close
Choose your channels

గుణశేఖర్ 'హిరణ్యకశిప' అప్ డేట్

Tuesday, November 6, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గుణశేఖర్ హిరణ్యకశిప అప్ డేట్

దర్శకుడు గుణ శేఖర్ రానా అనుష్కలతో చేసిన 'రుద్రమదేవి' చిత్రం తర్వాత 'హిరణ్యకశిప' చిత్రం చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పిన గుణ శేఖర్ రానా దగ్గుబాటితో చేయనున్నట్లు ప్రకటించాడు. కానీ ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఎటువంటి అప్ డేట్స్ లేవు. దింతో గుణ శేఖర్ 'హిరణ్యకశిప' చిత్రం అటకెక్కినట్లేనని అంతా భావించారు.

అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి రానా తండ్రి సురేష్ బాబు ఓ అప్ డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం దర్శక నటుడు రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన 'అదుగో' చిత్రం సురేష్ బాబు నిర్మించిన విషయం తెలిసిందే.ఈ చిత్రానికి సంబంధించిన ప్రెస్ మీట్ లో గుణ శేఖర్ రానా ల 'హిరణ్యకశిప ' గురించి అడగగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ఈ చిత్రం కోసం గుణశేఖర్ ఆఫీస్ లో ఇక్కడ రామానాయుడు స్టూడియోలో , అటు లండన్ స్టూడియోలో వర్క్ జరుగుతోంది. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ స్టాండర్డ్స్ లో పలు బాషలలో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాం. అందుకోసమే చాలా మంది ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్ కోసం పని చేస్తున్నారు.

దీనికి రానానే నటుడు నిర్మాత. రానా కు కామిక్స్ అంటే ఎంతో ఆసక్తి అందుకే ఈ తరహా సినిమాలు చేయడానికి రానా ఎక్కువగా ఇష్టపడుతూంటాడని, విఎఫ్ఎక్స్ ప్రధానంగా ఉండే ఈ చిత్రం ఇంటర్నేషనల్ స్థాయిలో తెరకెక్కనుందని సురేష్ బాబు చెప్పుకొచ్చాడు. సో...గుణశేఖర్ రానాల కాంబినేషన్ లో 'హిరణ్యకశిప' సినిమా కచ్చితంగా రానున్నట్లు కన్ఫర్మ్ అయినట్లే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.