చిరు 150 సినిమాపై క్లారిటి

  • IndiaGlitz, [Monday,January 18 2016]

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా గురించి గత కొన్నిరోజులుగా చ‌ర్చ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. చిరు 150వ సినిమాగా త‌మిళ్ లో ఘ‌న విజ‌యం సాధించిన క‌త్తి సినిమాని రీమేక్ చేస్తున్నారు. సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వినాయ‌క్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు.
ప్ర‌స్తుతం ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రానికి సంబంధించి స్ర్కిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంది. ఈ భారీ చిత్రాన్ని రామ్ చ‌ర‌ణ్ కొణిద‌ల ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ లో, రోబో 2 నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో క‌లిసి నిర్మిస్తుండ‌డం విశేషం. చిరంజీవి స‌ర‌స‌న న‌య‌న‌తార న‌టించే అవ‌కాశం ఉంది. ఆమె డేట్స్ కుద‌ర‌క‌పోతే వేరే హీరోయిన్ ని ఎంపిక చేస్తారు. దాదాపు 70 కోట్ల బ‌డ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తార‌ట‌.
అయితే సంక్రాంతి సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ వినాయ‌క్ తూర్పుగోదావ‌రి జిల్లా మామిడికుదురు మండ‌లం పాశ‌ర్ల‌పూడి లో ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వినాయ‌క్ మీడియాతో మాట్లాడుతూ... చిరు 150వ సినిమా గురించి క‌థా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని...మార్చిలో ఈ సినిమా పై పూర్తి స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌ని చెప్పారు.

అయితే ఇదిలా ఉండగా చ‌ర‌ణ్ బ‌ర్త్ డే మార్చి 27న చిరంజీవి 150వ సినిమా ప్రారంభిస్తార‌ని ఫిలిం నగర్ సమాచారం...

మ‌రి... చాలా గ్యాప్ త‌రువాత ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్న చిరు 150వ సినిమాతో ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తారో చూడాలి.

More News

అభిమానులు కొట్టుకున్నారు....

హీరోలు బాగానే ఉంటున్నారు, కానీ అభిమానులే కొట్టుకుంటున్నారు. అభిమానం హద్దులో ఉంటేనే బావుంటుంది. ఆ హద్దు దాటితేనే గొడవలు అవుతుంటాయి. నిన్న బాలకృష్ణ, నాగార్జున అభిమానుల విషయంలో అదే జరగింది. సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో డిక్టేటర్, సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాలు కూడా ఉన్నాయి.

నాని ఓవర్ సీస్ హక్కులు వీరివే...

ప్రముఖ నిర్మాణ సంస్థ 14రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై యంగ్ హీరో నాని,మెహరీన్(నూతన పరిచయం)హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం 'కృష్ణగాడి వీర ప్రేమగాథ'.

బాలయ్య హిస్టారికల్ సినిమా చేస్తాడా?

99వ సినిమా డిక్టేటర్ సినిమాతో సందడి చేసిన నందమూరి బాలకృష్ణ ఇప్పుడు వందో సినిమాకు రెడీ అవుతున్నాడు.

కొత్తగా ఆలోచిస్తున్న జగపతి...

సీనియర్ హీరోగా వంద సినిమాలు చేసిన జగపతిబాబు ఇప్పుడు విలన్ గా నటిస్తున్నాడు.రీసెంట్ గా నాన్నకుప్రేమతో చిత్రంలో విలన్ గా నటించిన జగపతిబాబు నటనకు మంచి పేరు వచ్చింది.

'స్పీడున్నోడు' ఆడియో రిలీజ్ డేట్

తమిళంలో శశికుమార్ హీరోగా రూపొందిన చిత్రం 'సుందరపాండ్యన్'.