'ఉప్పెన' నాలుగు రోజుల కలెక్షన్లు ఎంతో తెలిస్తే...

  • IndiaGlitz, [Tuesday,February 16 2021]

మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ‘ఉప్పెన’ చిత్రం వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. శుక్రవారం థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తొలిరోజు నుంచి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. నాలుగో రోజు సైతం మంచి వసూళ్లను సాధించి వైష్ణవ్‌కు తిరుగులేని విజయాన్ని అందించే దిశగా దూసుకెళుతోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన క్రితి శెట్టి హీరోయిన్‌గా నటించింది. స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి విలన్‌గా నటించాడు.

తొలిరోజే 10 కోట్లకు పైగా షేర్ రావడం అనేది ఒక డెబ్యూట్ హీరోకి అద్భుతమైన విషయమే. మెగా కుటుంబం నుంచి వచ్చిన వారసుడికి ప్రేక్షకులు ఏ స్థాయిలో బ్రహ్మరథం పడతారో ఈ చిత్రం చెప్పకనే చెబుతోంది. ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ కూడా అదరగొట్టేసింది. 21 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక నాలుగో రోజు కూడా మెగా హీరో అదరగొట్టేశాడు. నైజాంలో తొలిరోజు ఈ సినిమాకు 3.04 కోట్ల షేర్ వచ్చింది. అయితే తెలంగాణతో పోలిస్తే ఏపీలో సినిమాకు మరింత అద్భుతమైన వసూళ్లు వస్తున్నాయి. తొలిరోజు మిశ్రమ స్పందన వచ్చినా కూడా వసూళ్లపై ఏ మాత్రం ప్రభావం చూపించలేదు. ప్రపంచ వ్యాప్తంగా నాలుగో రోజు ఈ సినిమా ఈ సినిమా రూ.5.35 కోట్ల షేర్‌ను రాబట్టింది. కాగా.. నాలుగు రోజులూ కలిపి మొత్తంగా రూ.????.???? కోట్ల షేర్‌ను ఈ సినిమా రాబట్టింది.

నాలుగో రోజు ‘ఉప్పెన’ వసూళ్లు..

నైజాం.. రూ.1.35 కోట్లు
వైజాగ్ రూ. 78 లక్షలు
ఈస్ట్ రూ. 48 లక్షలు
వెస్ట్ రూ. 20.50 లక్షలు
క్రిష్ణా రూ. 25 లక్షలు
గుంటూరు రూ. 34 లక్షలు
నెల్లూరు రూ. 15 లక్షలు
సీడెడ్ రూ. 82 లక్షలు
నైజాం+ ఏపీ రూ. 4.6 కోట్లు
ఓవర్సీస్ రూ.30 లక్షలు
కర్ణాటక రూ.25లక్షలు
తమిళనాడు రూ.10 లక్షలు
రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.10 లక్షలు

మొత్తం నాలుగు రోజుల ‘ఉప్పెన’ వసూళ్లు

నైజాం.. రూ.19.88 కోట్లు
వైజాగ్ రూ. 5 కోట్లు
ఈస్ట్ రూ. 2.54 కోట్లు
వెస్ట్ రూ. 1.73 కోట్లు
క్రిష్ణా రూ. 2.01 కోట్లు
గుంటూరు రూ. 2.41 కోట్లు
నెల్లూరు రూ. 1.01 కోట్లు
సీడెడ్ రూ.4.52 కోట్లు
నైజాం+ ఏపీ రూ. 29.57 కోట్లు
ఓవర్సీస్ రూ.1.5 కోట్లు
కర్ణాటక రూ.1.56 కోట్లు
తమిళనాడు రూ.58 లక్షలు
రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.43 లక్షలు

More News

తెలంగాణలో ‘హస్త’మిస్తున్నా.. వీళ్లు మారరా?

కూర్చొన్న చోటు నుంచి కదలొద్దు.. కానీ విజయం కావాలంటూ కబుర్లు.. చేతుల నుంచి నియోజకవర్గాలకు నియోజకవర్గాలు జారి పోతున్నా.. నీరో చక్రవర్తిలా ఫిడేలు వాయించుకుంటూ కూర్చోవాలి.

కేంద్రం కీలక నిర్ణయం.. ఆ రెండు బ్యాంకులు గోవిందా?

దేశంలో అన్ని రకాల సంస్థల ప్రైవేటీకరణకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. తాజాగా బ్యాంకుల వంతు. కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ప్రైవేటీకరణపై వడివడిగా అడుగులు వేస్తోంది.

విజయ్ సేతుపతి తప్పుకున్నాడా? తప్పించారా?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతికి గత ఏడాది బంపర్ ఆఫర్ వచ్చింది. బాలీవుడ్‌లో ఛాన్స్ వచ్చిందంటే మామూలు విషయం కాదు. కానీ విజయ్ సేతుపతి ఆ అవకాశాన్ని వదులుకున్నాడు.

'ఎంఎస్ ధోనీ' చిత్రంలో నటించిన మరో నటుడి ఆత్మహత్య

‘ఎంఎస్ ధోనీ’ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఘటన మరువక ముందే అదే సినిమాలో నటించిన మరో నటుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్యతో ఇబ్బందులు పడలేకపోతున్నానని పేర్కొంటూ

చిరంజీవికి విల‌న్ ఫిక్స్ అయ్యాడా..?

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య‌’ షూటింగ్‌తో బిజి బిజీగా ఉన్నాడు. కాగా.. మ‌రో మూడు సినిమాల‌ను వ‌రుస లైన్‌లో పెట్టేసుకున్నాడు.