close
Choose your channels

'ఉప్పెన' ట్రైలర్ లో ఇవి గమనించారా?

Thursday, February 4, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఉప్పెన ట్రైలర్ లో ఇవి గమనించారా?

మెగా ఫ్యామిలీ  నుండి వస్తున్న మరో హీరో వైష్ణవ్ తేజ్. ఇంటి పేరు పంజా. ముగ్గురు మొనగాళ్లు చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్ ల ముద్దుల మేనల్లుడు. మెగాభిమానులను మాత్రమే కాదు... తెలుగు సినిమా ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాడు. సినిమాలో పాటలు ఎంత హిట్టో... మెగా మేనల్లుడి హ్యాండ్సమ్ లుక్కు కూడా అంతే హిట్టు. ఆడియన్స్ ఎప్పుడో అతడికి మార్కులు వేశారు. హీరోయిన్ కృతి శెట్టికి కూడా మంచి మార్కులే పడ్డాయి. సినిమాకు మార్కులు పడటం ఒక్కటే తక్కువ. మరి, ఆ మార్కులు పడాలంటే ముందు ప్రేక్షకులు థియేటర్లకు రావాలి. ఈ కరోనా కాలంలో వాళ్లు రావాలంటే హీరో హీరోయిన్లు, పాటలతో పాటు సినిమాలో విషయం ఉందని అర్థమయ్యేలా చెప్పాలి. అందుకు ట్రైలర్ అక్కరకు వచ్చిందని చెప్పాలి. అన్నట్టు... ఈ ట్రైలర్ లోనూ హీరో హీరోయిన్లు ఇరగదీశాడు. ఇద్దరికీ మొదటి సినిమా అయినప్పటికీ... ఎక్కడా అలా నటించలేదు. ప్రతి ఎమోషన్ పర్ఫెక్ట్ గా చూపించారు.

'ఉప్పెన' ట్రైలర్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ రిలీజ్ చేశాడు. ట్రైలర్ బావుందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసిస్తుంటే... మెగా అభిమానులు సూపర్ డూపర్ అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెండు నిమిషాల పది సెకన్ల ట్రైలర్... చూస్తున్నంత సేపూ సముద్ర తీర ప్రాంతానికి మనల్ని కూడా తీసుకు వెళ్లిందని చెబితే అతిశయోక్తి కాదు. అయితే... ఈ ట్రైలర్ లో కొన్ని అంశాలను మీరు గమనించారా? అవేమిటీ? అని ఒక్కసారి ఆలోచిస్తే...

ఆర్ట్ వర్క్ & సినిమాటోగ్రఫీ అండీ!

ఉప్పెన ట్రైలర్ లో ఇవి గమనించారా?

ట్రైలర్ ఓపెన్ అవ్వడమే పడవ మీద పడుకున్న హీరోను చూపిస్తూ ఓపెన్ చేశాడు దర్శకుడు సానా బుచ్చిబాబు. అక్కడ పెద్ద లైటింగ్ ఏమీ ఉండదు. ఒక లాంతరు తప్ప. దాన్నుంచి వచ్చే వెలుగు, ఆ సెటప్ భలే ఉంటుంది. ఆ తర్వాత హీరో నడిపే బండి. దాని హారన్, స్విచ్చు పల్లెటూరి వాతావరణానికి తీసుకువెళతాయి. ఊరు కూడా బావుందనుకోండి. తీరంలో పడవలు, అవి తీరానికి చేరుకుంటున్న సమయంలో చూపిన విజువల్స్ అయితే సింప్లీ సూపర్బ్.
డైలాగులు!

సానా బుచ్చిబాబు రాసిన మాటల్లో ఓ పల్లెటూరి వాతావరణం కనిపిస్తుంది. కొన్నిసార్లు ఎంతో డెప్త్ ఉన్న ఎమోషన్ కనపడుతుంది. ఓ అమాయకత్వం ఉంటుంది. 

'అబద్ధం ఆడితేనే ఆడపిల్లలు పుడతారంటే... మరీ ఇంత అందంగా పుట్టిందంటే? మినిమమ్ ఈళ్ళ బాబు మర్డర్ ఏదైనా చేసుండడేంట్రా?' 

ఉప్పెన ట్రైలర్ లో ఇవి గమనించారా?
అని హీరో అంటుంటే... హీరో పక్కన ఉన్న ఆర్టిస్ట్ మాత్రమే కాదు... మనం కూడా అంతే షాక్ అవుతాం! మరీ ఇంత అమాయకంగా ఆలోచించాడేంటి? అని! 

'జ్వరం కావాలా నీకు?' 

ఉప్పెన ట్రైలర్ లో ఇవి గమనించారా?

అని అడిగిన హీరోయిన్... హీరో 'ఊ' కొట్టిన తర్వాత ముద్దు పెడుతుంటే భలే క్యూట్ గా ఉంటుంది. 'నువ్వంటే నాకు అదో మాదిరి ఇష్టం బేబమ్మా' డైలాగ్ కూడా క్యూట్ గా ఉంది. రొమాంటిక్ సీన్స్ కి ఇంత క్యూట్ గా డైలాగులు రాసిన బుచ్చిబాబు... విలనిజం చూపించే సన్నివేశాల్లో సహజత్వానికి దూరంగా వెళ్లకుండా బలమైన మాటలు రాశాడు.

'నువ్వు కూతురితో పాటు కొడుకుని కూడా కన్నావు కదా! నీ పరువు ఎక్కడ తిరిగినా... సాయంత్రానికి ఆడు ఇంటికి అట్టుకొచ్చేత్తాడు'

ఉప్పెన ట్రైలర్ లో ఇవి గమనించారా?

- ఈ డైలాగ్ చెప్పిన విధానంలో విజయ్ సేతుపతి మీద తండ్రికి ఉన్న నమ్మకం అర్థమవుతుంది. 

'సముద్రం, ఆకాశం కలుత్తాయంటావురా?' 

ఉప్పెన ట్రైలర్ లో ఇవి గమనించారా?అని విజయ్ సేతుపతి అడిగితే... 
'అలలు ఎంత ఎగసి పడినా ఆకాశాన్ని ఎలా అందుకుంటాయయ్యా'
అని అనుచరుడు సమాధానం ఇస్తాడు. 
'మరి, ఆకాశం వంగితే?' అని విజయ్ సేతుపతి అనడంలో అప్పటికి ప్రేమలో పడిన హీరో హీరోయిన్లను ఏదో చేస్తాడని మన మనసు కీడు శంకిస్తుంది.

'ప్రేమ గొప్పదైతే చరిత్రలోని, సమాధుల్లోని కనపడాలి గానీ... పెళ్లి చేసుకుని పిల్లల్ని కని ఇళ్లలో కనపడితే దాని విలువ తగ్గిపోదూ! అందుకే, ప్రేమ ఎప్పుడూ చరిత్రలోనే ఉంటది. దానికి భవిష్యత్ ఉండదు' 

ఉప్పెన ట్రైలర్ లో ఇవి గమనించారా?

ట్రైలర్ లో లాస్ట్ డైలాగ్ ఇది. టాప్ క్లాస్ అంతే! ఎందుకంటారా? ప్రేమకు చిహ్నం ఏమిటి? తాజ్ మహల్. అది ముంతాజ్ సమాధి కదా! ఇక్కడ ట్రైలర్ లో ఫస్ట్ డైలాగ్ ఒకసారి గుర్తు చేసుకోండి... 
'ప్రేమంటే... లైలా-మజ్నులా, దేవదాసు-పార్వతిలా, ఓ రోమియో జూలియట్ లా అదో మాదిరిలా ఉండాలిరా' అని హీరో చెప్తాడు. ఆ ప్రేమికులు అందరూ చరిత్రకు ఎక్కినవాళ్లు. అయితే, ఆ జంటలు ఏవీ పెళ్లిళ్లు చేసుకోలేదు. పిల్లల్ని కనలేదు. రెండు డైలాగుల మధ్య ఎంత డెప్త్ ఉందో ఇప్పుడు మీకు అర్థమవుతోందా?

'ప్రేమ అంటే పట్టుకోవడం నాన్నా... వదిలేయడం  కాదు' అని హీరోయిన్ ఏడుస్తుంటే... ఆ ఎమోషన్ తో మనమూ కనెక్ట్ అవుతాం. 

ఉప్పెన ట్రైలర్ లో ఇవి గమనించారా?

లాస్ట్ బట్ నాట్ లీస్ట్...  విజయ్ సేతుపతి!

ఉప్పెన ట్రైలర్ లో ఇవి గమనించారా?
విజయ్ సేతుపతి ఫెంటాస్టిక్ పెర్ఫార్మర్ అని కోలీవుడ్ ఇండస్ట్రీలో కితాబు ఇచ్చింది. 'సూపర్ డీలక్స్', '96', 'విక్రమ్ వేద', 'సేతుపతి' సినిమాల్లో అతడి నటనకు తెలుగునాట కూడా అభిమానులు ఉన్నారు. 'సైరా నరసింహారెడ్డి'లో విజయ్ సేతుపతి ఓ రోల్ చేశాడు. కానీ, అతడిలో నటుడిని పూర్తిస్థాయిలో అది తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేదు. అనువాద సినిమాల్లో అతడికి అంత పేరు రాలేదు. అయితే... 'ఉప్పెన'తో విజయ్ సేతుపతి ఫుల్ ట్యాలెంట్ బయటకు వచ్చేలా ఉంది. 'ప్రాణం వేరు, పరువు వేరు కాదురా... రెండూ ఒక్కటే' అని డైలాగ్ చెప్పే సమయంలో విజయ్ సేతుపతి ఎక్స్ ప్రెషన్ టెర్రిఫిక్ అంతే!

విజయ్ సేతుపతి చంపింది ఎవర్ని?

విలన్ క్యారెక్టర్, అందులో నటించిన విజయ్ సేతుపతి ఎంత కసాయి అనేది చెప్పడానికి ట్రైలర్ లో 30 సెకన్ల దగ్గర రవివర్మను చంపినట్టు చూపించారు. సినిమాలో రవివర్మ పాత్ర ఏమిటి? అనేది ప్రస్తుతానికి సస్పెన్సు. అలాగే, హీరో హీరోయిన్లు విడిపోయారా? కలిశారా? అనేది కూడా! మొత్తం మీద ఈ ట్రైలర్ చూశాక... 'అదో మాదిరిలా, కొత్తగా అంత బావుందేంటి!?' అనుకోవడం ఖాయం. సినిమాకి ఫస్ట్ డే మార్నింగ్ షోకి వెళ్లాలని ఆడియన్స్ అనుకోవడం ఫిక్స్.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.