ఎమ్మెల్సీ కాబోతున్న ప్రముఖ నటి ఊర్మిళ!

ప్రముఖ నటి ఊర్మిళా మంతోడ్కర్ ఎమ్మెల్సీ అవనున్నారు. గత ఎన్నికల్లో చాలా యాక్టివ్‌గా ఉండటమే కాకుండా ముంబై నార్త్ నుంచి ఊర్మిళ కాంగ్రెస్ నుంచి సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి రాజకీయాలకు ఊర్మిళ దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే తాజాగా ఆమెను ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలని శివసేన భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ విషయంపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ తుది నిర్ణయం తీసుకున్నట్లు నేతలు పేర్కొంటున్నారు.

గవర్నర్ కోటా కింద 12 మంది నేతలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయనున్నారు. ఈ 12 మందిలో ఊర్మిళా పేరును ఉద్ధవ్ చేర్చినట్లు సమాచారం. ఊర్మిళను ఎమ్మెల్సీగా నామినేట్ చేసే విషయంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. ఊర్మిళను ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తున్నారన్న ఊహాగానాలు తన దృష్టికి కూడా వచ్చాయన్నారు. అది రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంటుందన్నారు. చివరి నిర్ణయం తీసుకోవడానికి ఉద్ధవ్‌కే అధికారమిచ్చామని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. అయితే గురువారం రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఎవరెవర్ని నామినేట్ చేయాలన్న దానిపైనే ప్రధానంగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

More News

టర్కీలో భారీ భూకంపం.. భయంతో జనం పరుగులు..

భూకంపం టర్కీ, గ్రీస్ దేశాల ప్రజలను భయకంపితులను చేసింది. టర్కీ‌‌లోని ఏజియన్ సముద్రంలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది.

కోలుకుంటున్న హీరో రాజశేఖర్.. వెంటిలేటర్ తొలగింపు

కరోనా నుంచి హీరో రాజశేఖర్ క్రమక్రమంగా కోలుకుంటున్నారు. నేడు ఆయనకు వెంటిలేటర్‌ను సైతం వైద్యులు తొలిగించారు.

అక్కడ కరోనా రెండో దశ ప్రారంభం.. తెలంగాణలో అధికారుల అప్రమత్తం..

కరోనా ప్రభావంతో పాటు భయం కూడా జనాల్లో బాగా తగ్గిపోయింది. జనజీవనం అంతా యథాతథ స్థితికి వచ్చేసింది.

'ఆర్‌ఆర్‌ఆర్‌' కోసం ఆలియా భట్‌ పాట

బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ అగ్ర కథానాయకులు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో

ఇండియాలో రికార్డ్ స్థాయిలో ఆపిల్ అమ్మకాలు..

భారతదేశంలో ఇటీవలే ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించిన టెక్ దిగ్గజ సంస్థ ఆపిల్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది.