ఉద్ధవ్ సమక్షంలో శివసేనలో చేరిన నటి ఊర్మిళ

బాలీవుడ్ నటి ఊర్మిళ మటోండ్కర్ మంగళవారం శివసేన పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన ఊర్మిళ రాజకీయాల్లో మాత్రం ఆశించినంతగా రాణించలేకపోయారు. దీంతో కొంతకాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కాగా.. ఇటీవల కొద్ది రోజలుగా ఆమె శివసేనలో చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆమెకు శివసేన ప్రభుత్వం ఎమ్మెల్సీని కూడా కన్ఫర్మ్ చేసిందని వార్తలు వినిపించాయి.

ప్రస్తుతం మహారాష్ట్రలో శివసేన సారథ్యంలోని మహాకూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి ఊర్మిళ మటోండ్కర్ గత ఏడాది రాజీనామా చేశారు. 2019 లోక్‌‍సభ ఎన్నికల్లో ముంబై నార్త్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పార్టీ నేతల తీరే తన ఓటమికి కారణమని భావించిన ఆమె గత ఏడాది సెప్టెంబర్‌లో కాంగ్రెస్ పార్టీని వీడారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఊర్మిళ నేడు శివసేనలో చేరారు. శివసేనలో ఊర్మిళ చేరికపై రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ సంతోషం వ్యక్తం చేశారు. ఆమె శివసైనికురాలని, ఆమె రాకతో పార్టీ మహిళా విభాగం మరింత బలపడతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

More News

నగరం నిద్రపోయిందా?

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది.

అస‌లు కాజల్ ఏం చెప్పాల‌నుకుంటుంది?

రీసెంట్‌గా త‌న క్లాస్‌మేట్ గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకున్న అందాల చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. హానీమూన్ మూడ్‌లోనే ఉంది.

లేడీస్ హాస్ట‌ల్స్ చేస్తున్న పనులపై రెచ్చిపోయిన చిన్మ‌యి...

మీటూ ఉద్య‌మం ఉధృతంగా జ‌రుగుతున్న స‌మ‌యంలో సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌హిళ‌లు ఎదుర్కొంటున్న లైంగిక ప‌ర‌మైన ఇబ్బందుల‌ను పేర్కొంటూ ద‌క్షిణాదిన గాయని చిన్మ‌యి

గ్రేటర్ ఎన్నికల హైలైట్స్...

గ్రేటర్ ఎన్నికల పోలింగ్ మందకొడిగానే కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్లు పెద్దగా ఉత్సాహం చూపించడం లేదు.

వార్‌కు సిద్ధమవుతున్న పవన్, ప్రకాష్‌రాజ్‌..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌లు వార్‌కు సిద్ధం కాబోతున్నారు. అయితే రియల్‌గా కాదులెండి..