ఉత్తమ్ సంచలన నిర్ణయం.. పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా

తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పీసీసీ అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. ఒకప్పుడు బల్దియాను ఏలిన ఆ పార్టీ... కేవలం రెండు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2016లోనూ రెండే స్థానాలు వచ్చినప్పటికీ అప్పుడున్న పరిస్థితులు వేరు.. ఇప్పుడున్న పరిస్థితులు వేరు. నాడు తెలంగాణను తీసుకొచ్చిన పార్టీగా ప్రజలు టీఆర్ఎస్‌ను నెత్తిన పెట్టుకున్నారు. దీంతో అప్పుడు టీఆర్ఎస్‌కి తప్ప వేరొక పార్టీకి ఓటేసే పరిస్థితి తెలంగాణలో లేదు. కానీ నేటి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.

టీఆర్ఎస్ పార్టీపై విపరీతమైన వ్యతిరేకత ప్రజల్లో వచ్చింది. ఇటీవల వరదల సమయంలో పరామర్శకు వెళ్లిన టీఆర్ఎస్ పార్టీ నేతలకు ఏ ఏరియాకు వెళ్లినా అక్కడి ప్రజానీకం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. నెత్తిన పెట్టుకున్న నేతలనే.. లాగి పెట్టి కొట్టినంత పని చేశారు. అంతటి వ్యతిరేకత వచ్చింది ఆ పార్టీపై. ఇలాంటి సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్‌పై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోలేక పోయింది. తెలంగాణను ఇచ్చిన పార్టీగా తమను తాము ప్రొజెక్ట్ చేసుకోవడంలో విఫలమవుతూనే ఉంది. తెలంగాణలో తమ ఉనికిని కాపాడుకోవడంలో విఫలమవుతూనే ఉంది.

తాజాగా మరోసారి కాంగ్రెస్ పార్టీకి జీహెచ్ఎంసీ పరిధిలోని ఓటర్లు పెద్ద షాకిచ్చారు. దీంతో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పీసీసీ అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఏఐసీసీకి పంపనున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు చోట్లే విజయం సాధించింది. ఉప్పల్, ఏఎస్‌రావునగర్‌లో ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రమే గెలుపొందారు. ఇటీవల జరిగిన దుబ్బాక ఉపఎన్నికలో కూడా కాంగ్రెస్ పరాజయం పాలైంది. వరుస పరాజయాల కారణంగా మనస్థాపం చెందిన ఉత్తమ్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

More News

గ్రేటర్ పాఠం: బలవంతుడ నాకేమంటే.. చలిచీమల చేత చిక్కాల్సిందే

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటాపోటీ వార్ జరిగింది. టీఆర్ఎస్ పార్టీ ఆది నుంచి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ వచ్చింది. దుబ్బాక ఫలితంతో వెంటనే కోలుకుని బీజేపీ చాపకింద నీరులా ఎదుగుతుందన్న వాస్తవాన్ని

బిగ్‌బాస్ 4 ఫైన‌ల్ గెస్ట్ ఎవ‌రంటే?

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 4 ముగింపు ద‌శ‌కు చేరుకుంటోంది. ఇప్పుడిప్పుడు బిగ్‌బాస్ గేమ్‌లో

సంక్రాంతి రేసులో అక్కినేని హీరోలు  లేరా..?

కోవిడ్ సినీ రంగంపై చాలా పెద్ద ప్ర‌భావాన్ని చూపిస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి భ‌యం లేకుండా షూటింగ్స్ స్టార్ట్ కావ‌డం లేదు.

ప్ర‌భాస్ ‘స‌లార్‌’కు అర్థం చెప్పిన డైరెక్ట‌ర్‌

బాహుబ‌లితో ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్ర‌భాస్ ఏక‌ధాటిగా ప్యాన్ ఇండియా  సినిమాల‌ను అనౌన్స్ చేస్తున్నాడు.

గ్రేటర్ ఫలితం: తొలిరౌండ్‌లో ‘కారు’దే జోరు...

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి తొలి రౌండ్ పూర్తైంది.