close
Choose your channels

ఉత్తేజ్ 'మయూఖ టాకీస్' సెకండ్ బ్యాచ్ ప్రారంభం

Thursday, July 18, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఉత్తేజ్ మయూఖ టాకీస్ సెకండ్ బ్యాచ్ ప్రారంభం

“నటన అనే కళ దైవదత్తమే అయినప్పటికీ దానికి శిక్షణ అవసరం. అలాంటి నటనలో మంచి శిక్షణ ఇచ్చే "మయూఖ టాకీస్" యాక్టింగ్ స్కూల్ స్థాపించి మొదటి బ్యాచ్ కి విజయవంతంగా శిక్షణ పూర్తి చేసి ఈరోజు రెండవ బ్యాచ్ క్లాసులను ప్రారంభిస్తున్న నటుడు, రచయిత, యాక్టింగ్ కోచ్ ఉత్తేజ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు"- అన్నారు ప్రముఖ దర్శకులు ఎస్ వి కృష్ణారెడ్డి.

ఈరోజు ఉదయం 9 గంటలకు హైదరాబాద్ ఎల్లారెడ్డి గూడ లోని మయూఖ యాక్టింగ్ స్కూల్ సెకండ్ బ్యాచ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్ వి కృష్ణారెడ్డి “ నటుడు అనేవాడు తన మాతృభాష కే పరిమితం కాకుండా వీలైనన్ని ఇతర భాషలను కూడా నేర్చుకునేందుకు ప్రయత్నించాలి. అప్పుడే ప్రకాష్ రాజ్ గారి లాగా బహుభాషా నటుడిగా ఎదగటానికి అవకాశం ఉంటుంది. ఈరోజు కొత్తగా శిక్షణ ప్రారంభిస్తున్న యాక్టింగ్ స్టూడెంట్స్ అందరికీ ఈ మయూఖ యాక్టింగ్ స్కూల్ ద్వారా ఉజ్వల భవిష్యత్తు ఏర్పడాలని కోరుకుంటున్నాను" అన్నారు.

సీనియర్ నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ" ఉత్తేజ్ నాకు చిన్నప్పటి నుండి తెలుసు. తను స్థాపించిన మయుఖా యాక్టింగ్ స్కూల్ ఫిల్మ్ ఇండస్ట్రీకి మంచి నటీనటులను అందిస్తుంది అనటంలో సందేహం లేదు. తపన, అంకిత భావం ఉన్న వాళ్లను ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పుడూ నిరాశ పరచదు" అన్నారు.

నటి, యాంకర్ ఝాన్సీ మాట్లాడుతూ " ఉత్తేజ్ నా సొంత తమ్ముడు లాంటివాడు. ఈ యాక్టింగ్ స్కూల్ కు తాను ఎంచుకున్న నలుగురు ఫ్యాకల్టీ నాకుచాలా బాగా తెలుసు. నట శిక్షణలో వాళ్ల అనుభవం అపారం. చాలా హైలీ టాలెంటెడ్ అండ్ డెడికేటెడ్ ఫ్యాకల్టీతో ఉత్తేజ్ ప్రారంభించిన ఈ మయూఖ యాక్టింగ్ స్కూల్ సెకండ్ బ్యాచ్ స్టూడెంట్స్ అందరికీ నా శుభాకాంక్షలు” అన్నారు.

ఈ కార్యక్రమ వ్యాఖ్యాతగా వ్యవహరించిన సీనియర్ జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ " నటన, రచన దర్శకత్వం ,యాంకరింగ్, డబ్బింగ్ వంటి అన్ని ముఖ్య శాఖలలో విశేషమైన అనుభవం ఉన్న ఉత్తేజ్ ప్రారంభించిన మయూఖ యాక్టింగ్ స్కూల్ గురించి ఇండస్ట్రీలో చాలా గొప్పగా చెప్పుకోవడం నేను విన్నాను. డబ్బు కోసం ఆశ పడి వచ్చిన అప్లికేషన్స్ అన్నింటినీ ఒప్పుకోకుండా, రిజర్వేషన్లకు, రికమండేషన్ లకు తావు లేకుండా 43 అప్లికేషన్స్ వస్తే వాటిలో కేవలం 19 మందిని మాత్రమే సెలెక్ట్ చేసి సెకండ్ బ్యాచ్ క్లాసులు ప్రారంభించిన ఉత్తేజ్ కి ఆల్ ద బెస్ట్" అన్నారు.

ఉత్తేజ్ మాట్లాడుతూ: ఫస్ట్ బ్యాచికి వీడ్కోలు చెబుతున్నందుకు బాధగా సెకండ్ బ్యాచ్ ని ప్రారంభిస్తున్న నందుకు ఆనందంగా ఉంది. విజయవంతమైన ఆ వీడ్కోలుకు
ఆశావహంగా ఉన్న ఈ ప్రారంభోత్సవానికి నాకు వెన్నుదన్నుగా నిలిచిన నా బలం నా ఫ్యాకల్టీయే. ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ ఇప్పటికే వెబ్ సిరీస్ లో, కొన్ని సినిమాల్లో, కొన్ని సీరియల్స్ లో నటిస్తుండగా ఆయా కోడైరెక్టర్లు నాకు ఫోన్ చేసి ఇంత చక్కగా తర్ఫీదు ఇచ్చినందుకు థాంక్స్ అంటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత తక్కువ ఫీజ్ స్ట్రక్చర్ తో, ఇంత మంచి
సపోర్టుతో, ఇంత సిస్టమేటిక్ గా నడుస్తున్న ఫిలిం ఇన్స్టిట్యూట్ రెండు రాష్ట్రాల్లో మరొకటి లేదని సగర్వంగా చెప్పగలను . ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన శ్రీ కృష్ణా రెడ్డి గారికి, అతిథులుగా వచ్చిన శివాజీ రాజా గారికి, యాంకర్ ఝాన్సీ గారికి, కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జర్నలిస్ట్ ప్రభు గారికి నా కృతజ్ఞతలు"- అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.