'వైదేహి' ట్రైల‌ర్ లాంచ్‌

  • IndiaGlitz, [Wednesday,January 02 2019]

యాక్టివ్ స్టూడియోస్ ప‌తాకంపై ఎ.జి.ఆర్‌. కౌశిక్ స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందుతున్న చిత్రం 'వైదేహి'. ఎ.జ‌న‌నీ ప్ర‌దీప్ నిర్మాత‌. ఎ.రాఘ‌వేంద్ర‌ప్ర‌దీప్ ద‌ర్శ‌కుడు. ఈయ‌న దివంగ‌త న‌టుడు ఏవీయ‌స్ త‌న‌యుడు. ఏవీయ‌స్ జ‌యంతిని పుర‌స్క‌రించుని జ‌న‌వ‌రి 2న హైద‌రాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా ట్రైల‌ర్‌ను ఎన్‌.శంక‌ర్ విడుద‌ల చేశారు. ఏవీయ‌స్ జ‌యంతి సంద‌ర్భంగా సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ప‌సుపులేటి రామారావు కేక్ క‌ట్ చేశారు.

ద‌ర్శ‌కుడు ఎ.రాఘ‌వేంద్ర‌ప్ర‌దీప్ మాట్లాడుతూ మా నాన్న‌గారిని గుర్తుచేసుకోవ‌డానికి ఓ మంచి అకేష‌న్ ఉంటే బావుంటుంద‌నిపించింది. ఆయ‌న పుట్టిన రోజున మా సినిమా ట్రైల‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించుకోవ‌డం ఆనందంగా ఉంది. న‌న్ను ప్రోత్స‌హించిన వారు చాలా మంది ఉన్నారు. మా న‌టీన‌టులు, టెక్నీషియ‌న్లను చాలా ఇబ్బందిపెట్టాను. రాత్రింబ‌వ‌ళ్లు షూటింగ్‌లు చేసేవాళ్లం. అయినా వారంద‌రూ చిరున‌వ్వుతో ప‌నిచేసేవారు. మా కుటుంబ స‌భ్యుల‌క‌న్నా ఎన్‌.శంక‌ర్‌గారు నాకు చాలా ఆత్మీయులు. ఆయ‌న చేతుల మీదుగా మా ట్రైల‌ర్ విడుద‌ల కావ‌డం ఆనందంగా ఉంది. మా బావ‌గారు నాకు ఇచ్చే స‌పోర్ట్ ను మ‌ర్చిపోలేను. చాలా సంద‌ర్భాల్లో ఆయ‌న మా నాన్న‌గారిలాగా న‌న్ను ప్రోత్స‌హిస్తున్నారు అని అన్నారు.

ఎన్‌.శంక‌ర్ మాట్లాడుతూ ఏవీయ‌స్ నాకు మంచి మిత్రులు. అద్భుత‌మైన క‌మ్యూనికేష‌న్ స్కిల్స్ ఉన్న వ్య‌క్తి. సినిమాల‌ను, సాహిత్యాన్ని ఔపాస‌న ప‌ట్టిన వ్య‌క్తి. ఆయ‌న లేని లోటు ఇండ‌స్ట్రీలో ఉంది. తుత్తి, రంగు ప‌డుద్ది వంటి మేన‌రిజ‌మ్స్ ను ఆయ‌న చాలా బాగా వాడేవారు. ఆయ‌న త‌న‌యుడు రాఘ‌వేంద్ర ప్ర‌దీప్ తెర‌కెక్కించిన ఈ సినిమా ట్రైల‌ర్ బావుంది. ఇప్పుడు ఇలాంటి జోన‌ర్‌లో తెర‌కెక్కిన సినిమాలు 90 శాతం హిట్ అవుతున్నాయి. ప్ర‌తి ఫ్రేమ్‌లోనూ నెక్స్ట్ ఏంటి? అని ఆస‌క్తిక‌లిగేలా సినిమాను తెర‌కెక్కించడం బావుంది. ట్రైల‌ర్‌లో ఆ ఉత్సుక‌త క‌నిపిస్తోంది అని చెప్పారు.

ప‌సుపులేటి రామారావు మాట్లాడుతూ బాపు-ర‌మ‌ణ‌గారికి, ఏవీయ‌స్‌గారికి ఉన్న అనుబంధం చాలా గొప్ప‌ది. ఏవీయ‌స్‌గారితో నాక్కూడా చ‌క్క‌టి సాన్నిహిత్యం ఉంది. వాళ్ల అబ్బాయి ద‌ర్శ‌కుడు కావ‌డం ఆనందంగా ఉంది అని అన్నారు.

మంచి పాత్ర‌ల్లో న‌టించినందుకు ఆనందంగా ఉంద‌ని న‌టీన‌టులు తెలిపారు.

మ‌హేష్‌, ప్ర‌ణ‌తి, సందీప్‌, అఖిల‌, లావ‌ణ్య‌, ప్ర‌వీణ్‌, వెంక‌టేష్‌, ఏవీ హాసిని, ఎ.రాఘ‌వేంద్ర ప్ర‌దీప్‌, శ్రీ హ‌ర్ష‌, కృష్ణ‌, శేఖ‌ర్ ర‌వితేజ‌, రామాంజ‌నేయులు, మాస్ట‌ర్ జితిన్‌, మాస్ట‌ర్ జ‌యంత్‌, మాస్ట‌ర్ జో్య‌తిరాదిత్య‌, పుండ‌రీక్‌, తేజ‌, ర‌మేష్‌, జైకాంత్‌, వికాస్‌, చంద్ర‌కాంత్‌, ప‌ర‌మేష్ కీల‌క పాత్ర‌ధారులు. ఈ సినిమాకు కెమెరా: దేవేంద్ర సూరి, సంగీతం: షారుఖ్‌, ఎడిటింగ్‌: ఫ‌్లికో ఆర్ట్స్, డీఐ: రాము అద్దంకి, ఎఫెక్ట్స్: వెంక‌టేష్‌, క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: ఎ.రాఘ‌వేంద్ర ప్ర‌దీప్‌.

More News

ఫిబ్రవరి 9న 'పలాస 1978' చిత్రీకరణ ప్రారంభం.

'లండన్ బాబులు' ఫేం రక్షిత్ హీరొగా , నక్షత్ర ను హీరొయిన్ గా పరిచయం చెస్తూ తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో బిక్రమ్ కృష్ణ ఫిలింస్ పతాకంపై తెరకెక్కుతొన్న చిత్రం 'పలాస 1978'.

సప్తగిరి హీరోగా 'వజ్ర కవచధర గోవింద'

స్టార్ కమెడియన్‌గా రాణిస్తూ 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్', 'సప్తగిరి ఎల్‌ఎల్‌బీ' చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ రూట్‌ని ఏర్పరుచుకున్నారు సప్తగిరి. ఆయన హీరోగా  'సప్తగిరి ఎక్స్‌ప్రెస్'

బెల్లంకొండ హీరో స‌ర‌స‌న విజ‌య్‌దేవ‌ర హీరోయిన్‌

క్రేజీ హీరో విజ‌య్‌దేవ‌ర‌కొండ స‌ర‌స‌న 'టాక్సీవాలా' చిత్రంలో న‌టించిన తెలుగు అమ్మాయి ప్రియాంక జ‌వాల్క‌ర్‌కు ఇప్పుడు అవ‌కాశాలు క్యూ కడుతున్నాయి.

బిగ్ బాస్ హోస్ట్‌గా వెంక‌టేష్‌

తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ మూడో సీజ‌న్‌కు సిద్ధ‌మ‌వుతోంది. తొలి సీజ‌న్‌లో ఎన్టీఆర్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించారు. ఆ సీజ‌న్‌కు మంచి క్రేజ్ వ‌చ్చింది. త‌ర్వాత ఎన్టీఆర్ బిజీగా మారిపోవ‌డంతో బిగ్‌బాస్

అకీరా ర‌క్తంలోనే ఉందంటున్న రేణుదేశాయ్‌

ప‌వ‌న్ మాజీ స‌తీమ‌ణి రేణుదేశాయ్ ద‌ర్శ‌కురాలిగానే కాదు.. ర‌చ‌యిత‌గా కూడా త‌న ప్ర‌య‌త్నాన్ని కొన‌సాగిస్తున్నారు. రీసెంట్‌గా ఆమె పొయెట్రీ పుస్త‌క రూపంలో విడుద‌లైంది.