వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' ఫస్ట్ లుక్ విడుదల

  • IndiaGlitz, [Thursday,January 23 2020]

సాయిధరం తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న 'ఉప్పెన' చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ఈరోజు విడుదలయింది. ఆ పోస్టర్లో కలర్ఫుల్ కాస్ట్యూమ్స్ ధరించి ఉన్న వైష్ణవ్ తేజ్ సముద్రం వైపు చేతులు చాపి బిగ్గరగా కేక వేస్తూ కనిపిస్తున్నాడు.

తొలి సినిమా కోసమే తన శరీరాకృతిని మార్చుకున్న అతను చాలా చురుగ్గా కనిపిస్తున్నాడు. పోస్టర్లో అతని బాడీ లాంగ్వేజ్ లోని టెంపరమెంట్, సముద్రం.. సినిమా టైటిల్ కు యాప్ట్ అనిపిస్తున్నాయి. వచ్చే వేసవిలో ఏప్రిల్ 2న మూవీని భారీ స్థాయిలో విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు.

లెజెండరీ డైరెక్టర్ సుకుమార్ దగ్గర అసోసియేట్ గా పనిచేసిన బుచ్చిబాబు సాన 'ఉప్పెన'తో దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాతో కృతి శెట్టి నాయికగా టాలీవుడ్ లో అడుగుపెడుతుండగా, తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి ఒక ప్రధాన పాత్ర చేస్తున్నారు.
'రాక్ స్టార్' దేవి శ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా, శాందత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ 'ఉప్పెన'ను నిర్మిస్తోంది.

తారాగణం: పంజా విష్ణవ్ తేజ్, విజయ్ సేతుపతి, కృతి శెట్టి, సాయిచంద్, బ్రహ్మాజీ

More News

'83' చిత్రాన్నిరిల‌య‌న్స్ సంస్థ‌తో క‌లిసి విడుదల చేస్తున్న నాగార్జున

భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో 1983 సంవత్స‌రాన్ని సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించాలి. ఆ ఏడాది క‌పిల్ దేవ్ నాయ‌కత్వంలో భార‌త క్రికెట్ జ‌ట్టు విశ్వ విజేత‌గా ఆవిర్భ‌వించింది.  

'సవారి' కంటెంట్ ఉన్న సినిమా: హీరో సుధీర్ బాబు

నందు హీరోగా నటిస్తోన్న 'సవారి' మూవీ థియేట్రికల్ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటరులో జరిగింది.

కన్నుల పండుగగా సాగిన జీ తెలుగు  జీ సినీ అవార్డ్స్‌ 2020

తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో అద్భుతమైన సీరియల్స్‌, అదిరిపోయే రియాలిటీ షోస్‌.. అంతకుమించిన సూపర్‌డూపర్‌ హిట్‌ సినిమాలతో అప్రతిహతంగా దూసుకుపోతోంది జీ తెలుగు.

కమెడియన్‌ సునీల్‌కు అస్వస్థత.. అసలేం జరిగింది!?

టాలీవుడ్ కమెడియన్, హీరో సునీల్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

'22' చిత్రం నుండి హీరోయిన్‌ సలోని మిశ్రా ఫస్ట్‌లుక్ గ్లింప్స్ విడుద‌ల‌

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌, సూపర్‌ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ మారుతి వద్ద దర్శకత్వ శాఖలో