close
Choose your channels

'వకీల్ సాబ్' బ్యూటీ బ్లాస్టింగ్ సెక్సీ లుక్స్

Tuesday, June 8, 2021 • తెలుగు Comments

తెలుగమ్మాయి అనన్య నాగళ్ల టాలీవుడ్ లో రాణించేందుకు అవసరమైన గుర్తింపు తెచ్చుకుంది. నటిగా ఆమెకు మంచి మార్కులు పడుతున్నాయి. మల్లేశం చిత్రంతో నటిగా మారింది అనన్య. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' లో ఛాన్స్ దక్కించుకుంది.

ఈ చిత్రంలో దివ్య నాయక్ గా ఆమె నటన అందరిని మెప్పించింది. సో.. అనన్యకు టాలీవుడ్ లో అవసరమైన గుర్తింపు ఇప్పటికే వచ్చేసింది. ఇక గ్లామర్ పరంగా కూడా మెప్పిస్తే హీరోయిన్ గా ఛాన్సులు మెరుగవుతాయి. ప్రస్తుతం ఈ యంగ్ బ్యూటీ ఆ పనిలోనే ఉంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందాల ఘాటుని నెటిజన్లకు తెలియజేస్తోంది.. అలాగే టాలీవుడ్ ఫిలిం మేకర్స్ ని ఆకర్షిస్తోంది. లేటెస్ట్ గా అనన్య ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఫోటో షూట్ చూస్తే మతిపోవడం ఖాయం. నడుము అందాలతో ఆమె సెక్సీ ఫోజులు వైరల్ అవుతున్నాయి. వంపులు తిరిగి ఉన్న ఆమె నడుము సొగసుతో కుర్రాళ్లకు నిద్ర దూరం కావడం ఖాయం.

సినిమాలపై ఫోకస్ పెడుతూనే వెబ్ సిరీస్ లలో కూడా రాణించాలని అనన్య ట్రై చేస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz