154 నిమిషాల నిడివితో ‘వకీల్ సాబ్’ రాబోతున్నాడు..

  • IndiaGlitz, [Tuesday,April 06 2021]

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌కల్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘వ‌కీల్ సాబ్‌’. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ప్ర‌ముఖ నిర్మాత బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్ ప‌తాకాల‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దాదాపు మూడు సంవత్సరాల గ్యాప్‌ తర్వాత ‘వకీల్ సాబ్’గా పవన్‌ కల్యాణ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. బాలీవుడ్‌లో మంచి సక్సెస్ సాధించిన ‘పింక్’ రీమేక్ కావడంతో ఈ సినిమా కూడా తప్పక సక్సెస్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

అలాగే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పాటలు, టీజర్‌, ట్రైలర్‌.. ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. దీంతో పవన్‌కు ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ఖాయమనే టాక్ బాగా వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయినట్లుగా చిత్రయూనిట్ అఫీషియల్‌గా ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాపై సెన్సార్ సభ్యులు కూడా ప్రత్యేక అభినందనలు తెలిపిసనట్టు సమాచారం. ఇక ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ రిపోర్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఏప్రిల్‌ 9న థియేటర్లలోకి వచ్చేందుకు అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

154 నిమిషాల నిడివి గల ఈ సినిమాలో పవన్‌ ఎంట్రీ, కోర్టు సీన్లు.. సినిమాకి హైలైట్‌గా ఉన్నాయని సెన్సార్ వర్గాలు తెలిపినట్టు టాక్ వినిపిస్తోంది. పింక్‌, నెర్కొండ పార్వైలోని మెయిన్‌ కథాంశాన్ని మార్చకుండా.. సరికొత్తగా 'వకీల్‌ సాబ్‌'ని వేణు శ్రీరామ్‌ చిత్రీకరించినట్లుగా తెలుస్తుంది. ఇక సెన్సార్ నుంచి అయితే ఈ చిత్రం మంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమాకు తిరుగుండదని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కాబోతోంది.

More News

ఏప్రిల్‌ 23న విజయ్‌ సేతుపతి, జయరామ్‌ నటించిన ‘రేడియో మాధవ్‌’

విజయ్‌ సేతుపతి, జయరామ్‌ హీరోలుగా నటించిన మలయాళ సినిమా ‘మార్కోని మతాయ్‌’. గుండేపూడి శీను సమర్పణలో

‘వైల్డ్ డాగ్’ చూశాక అడ్రినల్ రష్‌లాగా వచ్చింది: చిరు

అక్కినేని నాగార్జున హీరోగా అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వైల్డ్‌డాగ్‌’.

‘రిపబ్లిక్’ టీజర్: ఇంకా ఆ ఫ్యూడల్‌ వ్యవస్థలోనే బతుకుతున్నాం

దేవ్ కట్టా దర్శకత్వంలో సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా రూపొందుతును్న సినిమా ‘రిపబ్లిక్’. జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌,

పేకాట క్లబ్‌లు, పైరవీలు చేసేవాళ్లు రాజకీయాల్లో ఉండొచ్చు.. : పవన్ ఫైర్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రం ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది.

పవనొక వ్యసనం.. చనిపోయి బూడిదయ్యే వరకూ వదల్లేం: బండ్ల

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగా నటించిన చిత్రం ‘వకీల్ ‌సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం శిల్పకళా వేదికలో వైభవంగా జరిగింది.