close
Choose your channels

వ‌కీల్‌సాబ్‌కు త‌ప్ప‌ని లీకుల స‌మ‌స్య‌

Monday, June 29, 2020 • తెలుగు Comments

వ‌కీల్‌సాబ్‌కు త‌ప్ప‌ని లీకుల స‌మ‌స్య‌

సినిమా రంగానికి ఇప్పుడు క‌రోనా స‌మ‌స్య పెద్ద స‌మ‌స్య‌గా మారింది. అయితే క‌రోనా కంటే ముందే సినీ ప‌రిశ్ర‌మ‌ను ప‌ట్టి పీడిస్తున్న స‌మ‌స్య‌ల్లో ప్ర‌ధాన‌మైన పైర‌సీ కాగా.. మ‌రో సమ‌స్య లీకుల స‌మ‌స్య‌. చిన్న, పెద్ద అనే సినిమాలు తేడా లేకుండా లీకేజీ రాయుళ్లు సినిమాల‌ను బ‌య‌ట పెట్టేస్తున్నారు. దీని వ‌ల్ల న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల క‌ష్టం వృథా అయిన‌ట్లే. ఇప్పుడు ఈ లీకేజీ స‌మ‌స్య ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రీ ఎంట్రీ మూవీ ‘వ‌కీల్‌సాబ్‌’ను తెగ ఇబ్బంది పెడుతుంది. సినిమా షూటింగ్ స్టార్టింగ్ రోజునే ఈ సినిమాకు సంబంధించి ప‌వ‌న్ లుక్ లీకైంది. ఇప్పుడు మ‌రోసారి మ‌రో స్టిల్ లీకైంది. ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతుంది.

సినిమాలో కీల‌క‌మైన కోర్టు సీన్ ఫొటో బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ ఫొటోలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌, హీరోయిన్ అంజ‌లి క‌న‌ప‌డుతున్నారు. అయితే ఈ వ్య‌వ‌హారంపై నిర్మాత‌లు బోనీక‌పూర్‌, దిల్‌రాజు బాగా సీరియ‌స్ అయ్యారు. అయితే త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటే మాత్రం న‌ష్టం వాటిల్లే ప్ర‌మాదం ఉంద‌ని ప‌వ‌న్ అభిమానులు భావిస్తున్నారు. క‌రోనా ప్ర‌భావం లేకుండా ఉండుంటే ఈపాటికే సినిమా విడుద‌లై ఉండాల్సింది. కానీ క‌రోనా ఎఫెక్ట్‌తో సినిమా షూటింగ్ ఆగింది. సినిమా విడుద‌ల మాత్రం వ‌చ్చే ఏడాదినే అంటున్నాయి సినీ వ‌ర్గాలు.

Get Breaking News Alerts From IndiaGlitz