close
Choose your channels

టీడీపీ నుంచి వంశీ సస్పెండ్.. బాబుకు అంత సీన్ లేదు!

Friday, November 15, 2019 • తెలుగు Comments

టీడీపీ నుంచి వంశీ సస్పెండ్.. బాబుకు అంత సీన్ లేదు!

టీడీపీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి.. త్వరలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన టీడీపీ అధినేత మొదలుకుని నారా లోకేష్ ఇలా అందరి నేతలపై వంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో వంశీ వ్యాఖ్యలపై టీడీపీ అధిష్టానం సీరియస్‌గా స్పందించింది. ఈ క్రమంలో పార్టీ నుంచి వంశీని సస్పెండ్ చేస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకు కారణం నిన్న లోకేష్‌పై, ఓ చానెల్‌ డిబెట్‌లో ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని అధిష్టానం ఆయన్ను సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ఈ సస్పెండ్ చేయడంపై వంశీ మరోసారి రియాక్ట్ అయ్యారు. కాగా శుక్రవారం నాడు తాజా రాజకీయ పరిణామాలపై సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలతో నిశితంగా చర్చించిన అనంతరం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.

వంశీ స్ట్రాంగ్ రియాక్షన్..!

‘చంద్రబాబునాయుడు నన్నేమి సస్పెండ్ చేస్తాడు.. తన భవిష్యత్ తను చూసుకోవాలి ఫస్ట్. చంద్రబాబు ఎక్కువ ఊహించుకోకుండా తక్కువ మాట్లాడితే మంచిది. టీడీపీ పెద్దలు వాళ్ల పరువు వాళ్లు కాపాడుకోవడానికే. కలిసి పనిచేయలేనని, పార్టీకి రాజీనామా చేస్తానని ఇప్పటికే చెప్పాను. చంద్రబాబు నన్ను సస్పెండ్ చేసేదేంటి, అంత సీన్ లేదు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నానని ఇప్పటికే ప్రకటించిన తర్వాత సస్పెండ్ చేయడమేంటి..? అనే ప్రశ్నకు గాను పై విధంగా వంశీ రియాక్ట్ అయ్యారు.

Get Breaking News Alerts From IndiaGlitz