close
Choose your channels

‘2 బుల్లెట్లు కాల్చుకోవాలే.. 2 దాచుకోవాలె’ వాల్మీకీ టీజర్

Thursday, August 15, 2019 • తెలుగు Comments

‘2 బుల్లెట్లు కాల్చుకోవాలే.. 2 దాచుకోవాలె’ వాల్మీకీ టీజర్

వ‌రుణ్ తేజ్, అథ‌ర్వ ముర‌ళి, పూజా హెగ్డే నటీనటులుగా హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వాల్మీకీ’. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ సూపర్ హిట్టవ్వగా.. తాజగా రిలీజ్ అయిన టీజర్‌తో అదుర్స్ అనిపించాడు వరుణ్. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమాపై భారీగానే అంచనాలున్నాయి. టీజ‌ర్‌లో వ‌రుణ్ తేజ్ మ‌రీ రాక్షసంగా క‌నిపిస్తున్నాడు. ఈయ‌న లుక్ చూసిన జనాలకు ఒక్కసారైనా నిజంగానే భ‌యమేస్తుంది. ఈ మధ్య అన్నీ డిఫరెంట్‌ రోల్స్‌లో నటిస్తున్న వరుణ్‌.. వాల్మీకీలో మరీ రావణావతారంతో రక్తికట్టించాడని చెప్పుకోవచ్చు. టీజర్‌లోనే ఇలా ఉంటే సినిమాలో ఎలా ఉంటాడో ఏంటో మరి. కాగా.. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 13న థియేటర్లలోకి రానుంది.

పంద్రాగస్టు నాడు ఫ్యాన్స్ ఫిదా!

స్వాతంత్ర్య దినోత్సవం, రాఖీ పండుగలతో పాటు ఇప్పుడు వాల్మీకీ టీజర్ కూడా రావడంతో మెగాభిమానులు ఫిదా అయిపోయి పండుగ చేసుకుంటున్నారు. ఇక టీజర్ విషయానికొస్తే.. 00:51 సెకన్లుగల ఈ వీడియోలో వరుణ్, అథిర మొదట్లో కనిపిస్తారు. ప్రారంభంలోనే అదో రకంగా చూస్తూ జనాలను భయపెట్టే రకంగా ఉన్నాడు వాల్మీకీ. ‘నా సినిమాలో నా విలనే నా హీరో’ అని అథర్వా చెప్పే డైలాగ్‌.. టీజర్‌‌కు హైలైట్‌గా నిలిచింది. అంతేకాదు ఇక వరుణ్ విషయానికొస్తే.. తెలంగాణ యాసలో.. ‘అందుకే పెద్దొళ్లు చెప్పిళ్లు.. నాలుగు బుల్లెట్లు సంపాదిస్తే.. రెండు కాల్చుకోవాలే.. రెండు దాచుకోవాలె’ ఇది కూడా వాల్మీకీ అదరగొట్టేశాడని చెప్పుకోవచ్చు.

ఈ రెండు డైలాగ్స్, విజువల్స్ చాలు సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పడానికి. మొత్తానికి చూస్తే.. వరుణ్ నెగిటివ్ కారెక్టర్ చేస్తుండగా.. అథ‌ర్వ కీల‌క పాత్రలో న‌టిస్తున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రం మెగాభిమానులు ఏ మాత్రం మెప్పిస్తుందో తెలియాలంటే సెప్టెంబ‌ర్ 13 వరకు వేచి చూడాల్సిందే మరి.

Get Breaking News Alerts From IndiaGlitz